NewsOrbit
న్యూస్

ప్రేమించిన యువ‌తి కోసం భార‌త్‌-పాక్ బార్డ‌ర్ దాటాల‌నుకున్నాడు.. చివరకు ఏమైందంటే..?

బాలీవుడ్‌లో ఒకప్పుడు వచ్చిన వీర్‌-జారా సినిమా గుర్తుంది కదా. అందులో నటుడు షారుఖ్‌ ఖాన్‌ భారత పైలట్‌ వీర్‌ ప్రతాప్‌ సింగ్‌గా నటించగా, నటి ప్రీతి జింటా పాకిస్థాన్‌కు చెందిన యువతి జారా హయత్‌ ఖాన్‌గా నటించింది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ అనుకోని కారణాల వల్ల దూరమవుతారు. అయితే సరిగ్గా ఆ మూవీని ప్రేరణగా తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఆ యువకుడు కూడా తాను ప్రేమించిన పాక్‌ యువతి కోసం ఏకంగా గూగుల్‌ మ్యాప్స్‌ ఉపయోగించి భారత సరిహద్దు దాటేందుకు యత్నించాడు. కానీ బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)కు చిక్కాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

20 year old tried to cross pakisthan border for his girl friend

మహారాష్ట్రలోని ఒస్మానాబాద్‌ ప్రాంతం ఖవాజా నగర్‌లో నివాసం ఉండే 20 ఏళ్ల సిద్దిక్‌ మహమ్మద్‌ జిషాన్‌ అనే యువకుడు పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న షా ఫైసల్‌ టౌన్‌లో నివాసం ఉండే సమ్రా అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నిత్యం ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఇద్దరూ టచ్‌లో ఉండేవారు. అయితే జిషాన్‌ తాను ప్రేమించిన యువతిని ఎలాగైనా కలవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో పాకిస్థాన్‌ బార్డర్‌ దాటేందుకు యత్నించాడు. గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌ గుండా పాకిస్థాన్‌లోకి వెళ్లేందుకు యత్నించాడు. అందుకు గాను ఓ వాహనంలో అక్కడికి వెళ్లాడు.

అయితే జిషాన్‌ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లడంతో.. తల్లిదండ్రులు అతను పారిపోయాడనుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విషయం తెలుసుకుని గుజరాత్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తరువాతే అదే సమాచారాన్ని బీఎస్‌ఎఫ్‌కు చేరవేశారు. ఈ క్రమంలో జూలై 16వ తేదీన భారత్‌, పాక్‌ సరిహద్దు ప్రాంతం వద్ద.. అంటే పాక్‌ సరిహద్దుకు సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో పాక్‌లోకి వెళ్లేందుకు యత్నిస్తున్న జిషాన్‌ను బీఎస్‌ఎఫ్‌ వారు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కానీ అతను మాత్రం తన గర్ల్‌ ఫ్రెండ్‌ను చూసేందుకే పాక్‌కు వెళ్లాలని అనుకున్నానని చెబుతున్నాడు. అయితే అతను చెబుతున్నది నిజమా, కాదా అని బీఎస్ఎఫ్‌ వారు నిర్దారించే పనిలో పడ్డారు.

author avatar
Srikanth A

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N