(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికాలో తెలుగువారు రెండేళ్లకు ఒక సారి అత్యంత వైభవంగా జరుపుకునే తానా మహాసభలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. వాషింగ్టన్ డిసిలో 22వ తానా మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు ఎన్‌ఆర్ఐలు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.
ఈ ఏడాది మహాసభలలో ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు సిఎం రమేష్, గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్, సినీ సంగీత దర్శకులు కీరవాణి, థమన్‌తో పాటు గాయనీ గాయకులు సునీత, కౌసల్య, హేమచంద్ర, దీపు, రామాచారి, శ్రీనిధిలతో పాటు కవులు, రచయితలు, కళాకారులు, వ్యాపారవేత్తలు, తదితర ప్రముఖులు పాల్గొంటున్నారు. ప్రారంభ కార్యక్రమంలో అతిధులకు తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన ఘన స్వాగతం పలికారు.
వేడుకల్లో భాగంగా ఫండ్ రైజింగ్ ఈవెంట్స్, ధీంతానాల సందడి, స్పోర్ట్స్ కాంపిటేషన్స్ జరగనున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలుకుతున్న తానా ప్రతినిధులు (వీడియో 99 టివి సౌజన్యంతో)