250 పరుగులకు భారత్ ఆలౌట్

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్  తోలి ఇన్నింగ్స్ లో భారత్ 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిన్న తొలి రోజు 9 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసిన భారత్ రెండో రోజు ఆట ప్రారంభం కాగానే అదే స్కోరు వద్ద చివరి వికెట్ కోల్పోయింది. షమీ హాజెల్వుడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా కడపటి వార్తలందే సరికి వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.