న్యూస్ సినిమా

రూ.250 కోట్లు భరణంగా పొందిన సామ్.. షాకిస్తున్న బ్రహ్మాజీ కామెంట్స్..!

Share

టాలీవుడ్ అగ్ర తార సమంత, అక్కినేని నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఆ తర్వాత వీరు తమ వివాహ బంధానికి ముగింపు పలిగి షాక్ ఇచ్చారు. వారి డివోర్స్ తీసుకున్న తర్వాత నాగచైతన్య కంటే సమంతపైనే చాలా నెగిటివిటీ వచ్చింది. ఆమె గురించి సంచలన పుకార్లు కూడా హల్ చల్ చేశాయి. తనపై చేస్తున్న తప్పుడు ప్రచారం భరించలేక సమంత కోర్టును కూడా ఆశ్రయించింది. భరణం విషయంలో కూడా సమంతపై చాలా వార్తలు వచ్చాయి. చైతూని సామ్ రాచిరంపాన పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టే ఆపై సింపుల్‌గా అతన్ని వదిలించుకుందని దారుణమైన కామెంట్ చేశారు.

రూ.250 కోట్ల భరణం

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ “సామ్ నాగచైతన్య నుంచి రూ.250 కోట్లు భరణంగా అందుకుంది” అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ఆ సమయంలో సోషల్ మీడియాని షేక్ చేసింది. ఈ కామెంట్ చూసి సమంత షాక్ తిన్నది. మ్యారేజ్ సెటిల్మెంట్ భరణంగా రూపాయి కూడా తీసుకోలేదని తర్వాత క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ కామెంట్ పై ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కూడా తాజాగా స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ నెటిజన్లకు కొంచెం ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. వారు సెలబ్రిటీలతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని షాకింగ్ కామెంట్ చేశాడు. అంతేకాదు, అవకాశం వచ్చింది కదా అని సెలబ్రిటీలను డౌన్‌ చేయడానికి ప్రయత్నించకూడదు అన్నారు. అలా చేసిన పాపం మళ్లీ వారికే కొడుతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు ఇప్పుడు ఇవి ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

సమంత కూడా అలాగే

గతంలో బ్రహ్మాజీని నెటిజన్లు చాలా విషయాల్లో ట్రోల్ చేశారు. ఏ విషయంలోనైనా తప్పు చేస్తే సెలబ్రెటీలను దారుణంగా విమర్శించడంలో నెటిజన్లు ఎప్పుడూ ముందుంటారు. ఆ సెలబ్రిటీ ఎంత వాడు అయినా సరే! సమంత కూడా అలాగే వీరి చేతిలో ఘోరంగా టార్గెట్ అయ్యింది. విడాకులు ప్రకటించి చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ సమంతా పై ఎవరో ఒకరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. వారందరికీ బ్రహ్మాజీ ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చాడు.


Share

Related posts

బ‌న్ని సినిమాలో మ‌రో హీరోయిన్‌

Siva Prasad

ప్రకాష్ రాజ్ ఒకే ఒక్క డైలాగ్ తో పొలిటికల్ గా పవన్ పరువు తీసేసాడు..!!

sekhar

ZP Elections : ఎన్నికల్లో వివాదాల మయం..! ఒక్కో జిల్లాలో ఒక్కోరకమైన గొడవ..!!

somaraju sharma