తెలుగుదేశం ఎంపీ నిరశన

37 views

పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహననాయుడు నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా రాష్ట్ర సమస్యల పరిష్కారం డిమాండ్ తో ఆయనీ నిరశన దీక్ష చేపట్టారు. ఈ రోజు రామ్మోహననాయుడు పుట్టిన రోజు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు ఆవరణలో ఈ రోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన ఆయన ఉదయం నుంచి నిరశన దీక్షకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరశన దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు మద్దతుగా తెలుగుదేశం ఎంపీలు నినాదాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర వైఖరికి నిరసనగా శ్రీకాకుళం ఎంపీ కింజరాప్ రామ్మోహన్‌ నాయుడు పార్లమెంటు ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టాలని ఎంపీ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. పార్లమెంటు ముగిసే వరకు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. రామ్మోహన్ నాయుడు నిరసనకు మద్దతుగా టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు.

ఇలా ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు ఆవరణలో రోజుకో వేషధారణలో నిరసన తెలుపుతున్న తెలుగుదేశం ఎంపీ శివప్రసాదరావు ఈ రోజు విప్లవ కవి, గాయకుడు  వంగపండు ప్రసాదరావు వేషధారణలో తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాటలు పాడుతూ ఏపీకి కేంద్రం, మోడీ చేసిన అన్యాయాలను వివరించారు.

Inaalo natho ysr book special Review