NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

OBC, EWS Reservation: ఇకపై ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు

27 OBC 10 EWS reservation in medical seats from all India quota

OBC, EWS Reservation: వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 -22 విద్యాసంవత్సరం నుండి మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ (యూజీ, పీజీ)లో ఒబీసీ, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండీవియా తెలిపారు. ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్థులకు 27 శాతం, ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు పది శాతం రిజర్వేషన్లు అందజేయనున్నారు.

27 OBC 10 EWS reservation in medical seats from all India quota
27 OBC 10 EWS reservation in medical seats from all India quota

ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, బీడీఎస్, ఎండిఎస్, డిప్లొమో విద్యార్థులకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశానికి ఓ పరిష్కారం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ జూలై 26న సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ శాఖ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రతి ఏటా ఎంబీబీఎస్ లో దాదాపు 1500 ఓబీసీ, 550మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు, పీజీలో 2500 మంది ఓబీసీ, వెయ్యి మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు లబ్ది చేకూరనున్నది. వెనుకబడిన వర్గానికి ఈ డబ్ల్యుఎస్ వర్గానికి తగిన రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం తమ మాటకు కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ ఇది ఓ లాండ్ మార్క్ నిర్ణయంగా అభివర్ణించారు. ప్రతి ఏటా వేలాది మంది యువత మంచి అవకాశాలు పొందడంలో, అలాగే సామాజిక న్యాయానికి కొత్త ఉదాహారణ సృష్టించడంలో ఇది ఎంతో సహాయపడుతుందని మోడీ పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యుఎస్ వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడానికి గానూ 2019లో రాజ్యాంగ సవరణ జరిగింది.

 

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju