30 లో ఉన్న మహిళలు తప్పనిసరిగా పాటించవలిసిన  అశ్రద్ధ  వహించకూడని పరిశుభ్రత  అంశాలు గురించి తెలుసుకుందాం

Share

బాగా టైట్ గా పట్టి ఉండే లోదుస్తులను వాడకండి.
ఆ సున్నితమైన శరీర అవయవాల పై  ఎలాంటి ఒత్తిడి ఉండని స్కిన్ ఫ్రెండ్లీ, బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, కాటన్ వస్త్రాలను మాత్రమే వాడకానికి  ఎంచుకోండి.
తడిగా ఉండే లో దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. పొడిగా ఉండే వాటిని మాత్రమే వాడాలి. మూత్రవిసర్జన తరువాత యోని వద్ద టాయిలెట్ పేపర్‌తోతడి లేకుండా  తుడుచుకోవాలి. ఎందుకంటే అండర్ గార్మెంట్స్‌ కొద్దిపాటి తడి  ఉన్నా ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా  వ్యాపించే ప్రమాదం ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు తడిలేకుండా చూసుకోవాలి.

పిరియడ్ లో  ఉన్నప్పుడు  4-6 గంటలకు ఒకసారి  శానిటరీ ప్యాడ్స్‌ను ప్రతితప్పనిసరిగా మార్చుకోవడం మంచిది. ఒకే ప్యాడ్‌ను ఎక్కువ సమయంఉంచుకోవడం  వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వ్యాపిస్తాయి . టాంపూన్లు  వాడేవారు వాటిని సరైన పద్ధతిలో మాత్రమే వాడాలి. అవసరం అనుకుంటే  గైనకాలజిస్ట్ ను సంప్రదించి సలహాలు సూచనలు పాటించాలి.శృంగారం తర్వాత యోని పై భాగాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కానీ యోని లోపల భాగాన్ని  సబ్బుతో  కానీ మార్కెట్లో దొరికే  ఎక్కువ గాఢత ఉండే క్లీనింగ్ ఉత్పత్తులను, సువాసనలు వెదజల్లే ప్రొడక్ట్స్‌ను వాడి శుభ్రం చేసుకోకూడదు. వీటి వల్ల యోని పొడిబారి కొత్త సమస్యలు వస్తాయి . ఒకవేళ అవసరమైతే నిపుణుల సలహాతో వాటిని వాడాలి.

అంతర్గత అవయవాల దగ్గర చర్మం చాలా సున్నితంగా ఉండటం వలన ఈ భాగాలు శుభ్రం చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి .
అసురక్షితమైన శృంగారం వల్ల  కొన్ని లైంగిక వ్యాధులు వ్యాపించవచ్చు. లైంగికంగా సంక్రమించే వ్యాధులు దీర్ఘకాలంపాటు  వేధిస్తాయి. ఒకవేళ భాగస్వామికి సుఖ వ్యాధులు ఉంటే కనుక  వారు పూర్తిగా కోలుకునే వరకు శృంగారానికి  దూరంగా ఉండటం మంచిది.
ప్రతి స్త్రీ వజైనల్ ఆరోగ్యానికి చెందిన  అంశాలపై కనీస అవగాహన పెంచుకుంటూ ఉండాలి.


Share

Related posts

Donkey milk: గాడిద పాలు అమృతం తో సమానమాట?? అసలు ఆ పాలు ఎంత ఖరీదో తెలుసా?

Kumar

సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న ఫస్ట్ సినిమా ఇదే !!

Naina

జగన్ పోలిటికల్ కెరీర్ లోనే అతిపెద్ద గుణపాఠం ఇది ! 

sekhar