పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న బస్సు కారును డీకొట్టింది. ఆ తర్వాత రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాత పడగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన వాయువ్య పాకిస్థాన్ గిల్గిత్ బాలిస్థాన్ లోని దయామిర్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది.

గిల్గిత్ నుండి రావల్పిండికి ప్రయాణీకులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాద ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులుక మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాకిస్థాన్ ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నయి. గత నెలలో బలూచిస్థాన్ ఓ ప్యాసింజర్ బస్సు లోయలో పడటం వల్ల 41 మంది మృత్యువాత పడ్డారు.
ఏపిలో పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం