ఎయిర్ షో వద్ద భారీ అగ్నిప్రమాదం

బెంగళూరు, ఫిబ్రవరి 23: బెంగళూరులోని యెలహంక ఎయిర్ బేస్‌లో జరుగుతున్న ఏరో ఇండియా 2019 లో భారీ అగ్ని ప్రమాధం సంభవించింది.

ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పార్క్ చేసిన వాహనాల వద్ద ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.

సుమారు 300లకుపైగా కార్లకు మంటలు అంటుకున్నాయి. వీటిలో వందకుపైగా కార్లు పూర్తిగా దెబ్బతినగా మరి కొన్ని కార్లు పాక్షికంగా తగులబడ్డాయి.

ప్రదర్శనా స్థలం వద్ద ఏర్పాటు చేసిన ఐదవ నెంబరు గేటు వద్ద ఈ ఘటన జరిగింది.

పదికి పైగా అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఎయిర్ షో 24వ తేదీ ఆదివారం వరకూ జరగనుంది.

ఎయిర్ షో తిలకించేందుకు దూర ప్రాంతాల నుండి జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

వీడియో కొరకు కింద క్లిక్ చేయండి