AAI-recruitment-2020
విమానాశ్రయాల సమర్థ నిర్వహణకు ట్రాఫిక్ కంట్రోల్, ఆపరేషన్స్, టెక్నికల్ విభాగాల సేవలు ముఖ్యమైనవి. మేనేజర్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలు, ప్రయాణం సాఫీగా జరిగేలా విధులు నిర్వహిస్తుంటారు. మొత్తం 368 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సైన్స్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు.ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ చూపినవారికి ఆ పోస్టు/ విభాగం బట్టి ఇంటర్వ్యూ/ ఫిజికల్ మెజర్‌మెంట్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్టు/ డ్రైవింగ్ టెస్టు/ వాయిస్ టెస్టు ఉంటాయి. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకం జరుగుతుంది. ఎంపికైతే మేనేజర్లకు రూ.60 వేలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.40 వేలు మూలవేతనం ఇస్తారు. ఇంకా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. మొత్తం కలుపుకుని జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు రూ.12 లక్షలు, అదే మేనేజర్లయితే రూ.18 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 368
మేనేజర్: ఫైర్ సర్వీసెస్ 11, టెక్నికల్ 2
అర్హత: మెకానికల్ లేదా ఆటోమొబైల్ విభాగంలో బీఈ/బీటెక్. అలాగే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో సంబంధిత విభాగంలో అయిదేళ్ల పని అనుభవం ఉండాలి.
జూనియర్ ఎగ్జిక్యూటివ్: ఏర్ ట్రాఫిక్ కంట్రోల్ 264, ఏర్ పోర్టు ఆపరేషన్స్ 83, టెక్నికల్ 8 పోస్టులు ఉన్నాయి.
అర్హత: ఏర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి మ్యాథ్స్, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్. ఏర్ పోర్టు ఆపరేషన్స్‌కు సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంబీఏ, బీటెక్ చదివినవారై ఉండాలి. టెక్నికల్ ఖాళీలకు మెకానికల్ లేదా ఆటోమొబైల్‌లో బీఈ/బీటెక్ చదివుండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఎలాంటి పని అనుభవం అవసరం లేదు. అన్ని పోస్టులకు 60% మార్కులు ఉండాలి.
వయసు: మేనేజర్లకు 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు 27 ఏళ్లు ఉండాలి. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
అన్ని పోస్టులకు ముందుగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రుణాత్మక మార్కులు ఉండవు. ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం ఇంటర్వ్యూ, దేహదార్ఢ్య, డ్రైవింగ్, వాయిస్ టెస్టు ఉంటాయి. వీటిలోనూ అర్హత సాధించాలి. తుది నియామకాలు రాత పరీక్ష, సంబంధిత విభాగాల్లో చూపిన ప్రతిభ ద్వారా తీసుకుంటారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు దేశంలో ఎక్కడైన విధులు నిర్వర్తించాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఏటీసీ), మేనేజర్ (ఫైర్ సర్వీసెస్) పోస్టుల్లో చేరేవారు శిక్షణ తరవాత కనీసం మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఆ పోస్టును బట్టి రూ.7 లేదా రూ.5 లక్షల విలువైన ఒప్పంద పత్రంపై అంగీకారం తెలపాలి.
దరఖాస్తులు ప్రారంభతేది : 15/12/2020.
చివరి తేదీ : 14/1/2021.
ఫీజు : రూ.1000/-. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.170/-.
వెబ్‌సైట్: http://www.aai.aero/
Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…