3వేల మందిని తరలించిన సైన్యం

సిక్కిం: భారత సైన్యం సుమారు మూడువేలమంది యాత్రీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇండియా-చైనా సరిహద్దు సమీపంలో సిక్కిం, నాథూలా కనుమ వద్ద భారీగా కురిసిన మంచు వల్ల పర్యాటకులు చిక్కుకుపోయారు. పరిస్థితిని గమనించిన సైన్యం సత్వరం రంగంలోకి దిగి వారిని సురక్షతంగా అక్కడ నుంచి తరలించింది. వారికి సరిహద్దులోని తమ శిబిరాలలోనే ఆశ్రయం కల్పించారు. పర్యాటకుల్లో మహిళలు, చిన్నపిల్లలకు ఆహారంతోపాటుగా చలిని తట్టుకునేందుకు స్వెట్టర్లను, అవసరమైన మందులను అందజేశారు. సిక్కింలో భారీగా కురిసిన మంచు కారణంగా సరిహద్దులోని నాథూలా పాస్‌ చూసేందుకు వచ్చిన ప్రయాణీకులకు చెందిన సుమారు 300నుంచి 400పైగా వాహనాలు రహదారులపైన నిలిచిపోయాయి. ప్రయాణీకుల్లో 1500మందికి 17వ మైలువద్ద, మిగిలిన వారిని 13వ మైలు వద్ద రక్షణశాఖకు చెందిన షెల్టర్లకు తరలించారు.