నలుగురు టెర్రరిస్టులు మృతి

శ్రీనగర్, డిసెంబరు29: జమ్మూ,కాశ్మీర్లోని పుల్వానా జిల్లాలో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య శుక్రవారం జరిగిన  ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదులు మరణించారు.  దక్షిణ కాశ్మీర్‌లోని హన్జన్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందటంతో బలగాలు అక్కడకు చేరుకుని శోధించడం ప్రారంభించారు. దీంతో  టెర్రిరిస్టులు  కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు  ఎదురు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో నలుగురు  టెర్రరిస్టులు అక్కడికక్కడే  మరణించినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.