CRACKERS : 400 ఏళ్ల నాటి పద్ధతిలో టపాసులను మీరు ఎప్పుడైనా చూశారా ..?

Share

CRACKERS: సాధారణంగా పిల్లలు, పెద్దలకు దీపావళి పండుగ అంటే చాలా ఇష్టముంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ పండుగ చాలా ఇష్టం. ఎందుకంటే.. హ్యాపీగా టపాసులు పేల్చుకోవచ్చని పిల్లలు అనుకుంటారు. అయితే, ఇలా క్రాకర్స్, టపాసులు భారీ స్థాయిలో పేల్చడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు జరుగుతున్నది. శబ్దకాలుష్యంతో పాటు వాయు కాలుష్యం కూడా బాగా పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత ప్రొడక్ట్స్ యూజ్ చేయాలని పర్యావరణ కార్యకర్తలు చెప్తున్నారు. కానీ, రోజురోజుకూ టపాసుల వాడకం బాగా పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే దీపావళి(deepavali) కోసం ప్రత్యేకమైన టపాసులు తయారు చేసింది గుజరాత్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ.

Chiranjeevi Bhola shanker : భోళా శంకర్ మూవీ షూటింగ్, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ మీకోసం..!

చిల్డ్రన్ ఫ్రెండ్లీ టపాసులు..

పిల్లలకు ఎటువంటి హాని కలుగకుండా ఉండేందుకుగాను సదరు స్వచ్ఛంద సంస్థ స్పెషల్ కేర్ తీసుకుంది. అందుకుగాను దేశవాళీ బాణాసంచాను 400 ఏళ్ల కిందటి పద్ధతిలో తయారు చేసింది. వోకల్ ఫర్ లోకల్ (vokal for lokal)స్ఫూర్తితో ఈ టపాసుల తయారీకి సదరు స్వచ్ఛంద సంస్థ పూనుకుంది.

దుబ్బాక కి కేసిఆర్ వెళ్లి ఉంటే …??
పర్యావరణ హిత తయారీకి పలువురి అభినందన..

గుజరాత్‌లోని వడోదరకు చెందిన ప్రముఖ్ పరివార్ స్వచ్ఛంద సంస్థ ప్రధాని మోడీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపులో భాగంగా ఈ టపాసులను తయారు చేసింది. ఈ టపాకాయను బంకమట్టితో రూపొందించారు. ఈ దేశవాళీ క్రాకర్స్‌తో అటు పర్యావరణానికి కాని ఇటు మనుషులకు కాని ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. ఈ టపాకాయలు(crackers) వందశాతం దేశవాళీ టపాసులని, బంకమన్ను, కాగితం వెదరు పదార్థాలు, ఇతర సామగ్రితో ఈ టపాసులు తయారు చేసినట్లు వారు పేర్కొన్నారు.

Deepavali: దీపావళి ఇలా జరుపుకుంటే లక్ష్మి దేవి మీ ఇంటిలోనే ఉంటుంది!!
ఈ టపాసులను ‘కోథీ’లుగా పిలుస్తున్నారు. స్వదేశీ క్రాకర్స్ తయారీ ద్వారా పర్యావరణ హితమైన పని జరిగిందని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నితల్ గాంధీ తెలిపారు. ఈ పర్యావరణ హిత ప్రొడక్ట్స్ తయారీ ద్వారా స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. ఇలా టపాసులు తయారు చేసినందుకుగాను ప్రముఖ్ పరివార్ సంస్థను, ఆ సంస్థ ప్రతినిధులను పలువురు అభినందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకుగాను ఈ క్రాకర్స్ పేల్చాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.


Share

Related posts

Bigg Boss 5 Telugu: నా దగ్గర చీప్ ట్రిక్స్ ప్లే చేయకు యాంకర్ రవి కి మైండ్ బ్లోయింగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ కంటెస్టెంట్..!!

sekhar

జబర్దస్త్, బిగ్ బాస్ షోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్..??

sekhar

ఎన్టీఆర్ ఐడియా ని ఫాలో అవుతున్న రజినీకాంత్..??

sekhar