405 మందికి జైలు శిక్ష

హైదరాబాద్, జనవరి 5: హైదరాబాద్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 405 మదికి హైదరాబాద్ కోర్టు జైలు శిక్ష విధించింది. సైబరాబాద్ పరిధిలో ఒక్కరోజులోనే516 మదింని ట్రాఫిక్  పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.  వీరికి మూడునుంచి 16రోజుల వరకు కోర్టు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పడ్డవారిలో ఇరువురు మహిళలు ఉన్నారు. డిసెంబరు 31 న మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులు. వీరిలో  లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన  111 మందికి కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది.