(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
గుంటూరు, డిసెంబర్ 24 ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపూస్మా) కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరుకు చెందిన విద్యా రత్న అవార్డు గ్రహీత కొల్లి నాగేశ్వరరావు ఎన్నికైయ్యారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో శ్రీ నాగార్జున హైస్కూల్ ప్రాంగణం నందు జరిగిన కార్యాచరణ రూపకల్పన సభలో అపూస్మా గౌరవ అధ్యక్షులు, అధ్యక్ష కార్యదర్శులు ,కోశాధికారి మరియు రెండు జిల్లాలలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కొల్లి నాగేశ్వరరావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.