443/7 వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్

మెల్ బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగియడానికి మరో 6 ఓవర్లు మిగిలి ఉండగా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టాల్సి వచ్చింది. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 215/2తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి సెషన్ లో వికెట్లేమీ కోల్పోకుండా ఆడినప్పటికీ లంచ్ తరువాత నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే స్కోరు బోర్డును బ్యాట్స్ మన్ పరుగులు పెట్టించారు. పుజారా 106, కోహ్లీ 82, రోహిత్ శర్మ 62 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టి ఒక ఓవర్ లో వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది.