NewsOrbit
న్యూస్

ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను తీసుకోవ‌డం వల్ల క‌లిగే లాభాలివే..!

క‌రోనా నేప‌థ్యంలో ఇప్పుడు అన్ని ప‌నుల‌ను చాలా మంది ఇంటి నుంచే చేస్తున్నారు. ఇంత‌కు ముందు కిరాణా స‌రుకుల కోసం బ‌య‌ట‌కు వెళ్లేవారు. కానీ వాటిని ఆన్ లైన్‌లోనే ఆర్డ‌ర్ చేస్తున్నారు. ఇక ఇలాగే ఎన్నో ప‌నుల‌ను జ‌నాలు ఆన్‌లైన్ ద్వారానే పూర్తి చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వినియోగ‌దారుల‌కు పాల‌సీల‌ను ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నాయి. దీంతో పాల‌సీల‌ను తీసుకోవ‌డం ప్ర‌స్తుతం చాలా సుల‌భ‌త‌రం అయింది. అయితే ఆన్‌లైన్‌లో పాల‌సీల‌ను తీసుకోవ‌డం వల్ల వినియోగ‌దారుల‌కు ప‌లు లాభాలు కూడా క‌లుగుతాయి. అవేమిటంటే…

5 benefits if you take insurance policy through online

1. సాధార‌ణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏజెంట్ల‌ను నియ‌మించుకుంటాయి. వారు వినియోగ‌దారుల‌కు పాల‌సీల‌ను విక్ర‌యిస్తుంటారు. ఒక్కో పాల‌సీ విక్ర‌యిస్తే వారికి కంపెనీలు నిర్దిష్ట‌మైన క‌మిష‌న్‌ను చెల్లిస్తాయి. అయితే ఆన్‌లైన్ లో పాల‌సీ తీసుకోవ‌డం వ‌ల్ల ఏజెంట్లు ఉండ‌రు. అందువ‌ల్ల ఆ క‌మిష‌న్ ను కూడా కంపెనీలు ఏజెంట్ల‌కు చెల్లించాల్సిన ప‌నిలేదు. దీంతో ఆ క‌మిష‌న్ మేర మ‌నం క‌ట్టే పాల‌సీ ప్రీమియంలో మొత్తాన్ని త‌గ్గిస్తారు. దీంతో పాల‌సీ మ‌న‌కు త‌క్కువ‌కే వ‌స్తుంది. ఆ మేర మనం త‌క్కువ ప్రీమియం చెల్లించ‌వచ్చు.

2. మ‌న‌కు ఏజెంట్లు పాల‌సీల‌ను అమ్మేట‌ప్పుడు వాటి గురించి వారు పూర్తిగా చెప్ప‌రు. కేవ‌లం లాభాల గురించే చెబుతారు. కానీ ఆన్‌లైన్‌లో పాల‌సీ తీసుకుంటే మ‌నం వాటికి చెందిన లాభ న‌ష్టాల‌ను పూర్తిగా తెలుసుకోవ‌చ్చు. పూర్తిగా పార‌ద‌ర్శ‌క‌మైన ప‌ద్ధ‌తిలో మ‌న‌కు పాల‌సీ ఇస్తారు. అందువ‌ల్ల మ‌న‌కు ఆన్‌లైన్‌లో పాల‌సీలు తీసుకుంటే ఈ లాభం క‌లుగుతుంది.

3. ఏజెంట్లు మ‌న‌కు పాల‌సీల‌ను ఇచ్చేట‌ప్పుడు మ‌న‌కు అవ‌స‌రం లేకున్నా అందులో కొన్ని ఫీచర్ల‌ను క‌లిపి ఇస్తారు. అయితే ఆన్‌లైన్ లో పాల‌సీ తీసుకుంటే మ‌న‌కు స్వేచ్ఛ ఉంటుంది. అందుక‌ని మ‌నకు న‌చ్చిన ఫీచర్ల‌తోనే పాల‌సీల‌ను తీసుకోవ‌చ్చు.

4. ప్ర‌స్తుతం మ‌న‌కు పాల‌సీల‌ను అనేక కంపెనీలు విక్ర‌యిస్తున్నాయి. అందువ‌ల్ల ఏ కంపెనీ ఎలాంటి పాల‌సీలు అందిస్తుందీ, వాటి ఫీచ‌ర్లు ఏమిటీ, పేమెంట్ విధానం ఎలా ఉంటుంది, వాటి వ‌ల్ల ఎలాంటి లాభ న‌ష్టాలు ఉంటాయి, ఎంత ప్రీమియం చెల్లిస్తే ఎంత క‌వ‌రేజీ ల‌భిస్తుంది.. త‌దిత‌ర వివ‌రాల‌ను అన్నింటినీ మ‌నం ఆన్‌లైన్‌లో పోల్చి చూసుకోవ‌చ్చు. వాటిలో ఉత్త‌మ‌మైన పాల‌సీని మ‌నం ఎంపిక చేసుకోవ‌చ్చు. ఆఫ్ లైన్ లో పాల‌సీ తీసుకుంటే మ‌న‌కు ఈ సౌక‌ర్యం ఉండ‌దు.

5. ఆఫ్ లైన్ లో పాల‌సీ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ల‌కు అనేక ర‌కాల ప‌త్రాల‌ను అంద‌జేయాల్సి ఉంటుంది. అదే ఆన్‌లైన్ అయితే అంతా డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో పూర్త‌వుతుంది. మ‌న‌కు సంబంధించిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను డిజిట‌ల్ రూపంలోనే స‌బ్‌మిట్ చేసి పాల‌సీ పొంద‌వ‌చ్చు. పైగా చాలా వేగంగా ప్రాసెస్ అయి పాల‌సీ మ‌న చేతికి వ‌స్తుంది.

author avatar
Srikanth A

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N