NewsOrbit
న్యూస్ హెల్త్

వ‌ర్షాకాలంలో వ‌చ్చే 5 కామ‌న్ వ్యాధులు.. వాటిని ఇలా అడ్డుకోవ‌చ్చు..!

వ‌ర్షాకాలం వ‌స్తుందంటే చాలు.. అనేక ర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల‌ను మోసుకుని వ‌స్తుంది. అనేక విష జ్వ‌రాలు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ సారి కూడా వ‌ర్షాకాలం మొద‌లైంది. అయినా వ‌ర్షాలు ఇంకా గ‌ట్టిగా ప‌డ‌డం లేదు. కానీ మ‌నం ఈ సీజ‌న్‌లో వ‌చ్చే ప‌లు కామ‌న్ వ్యాధుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. కొన్ని సూచ‌న‌లు పాటిస్తే వాటిని రాకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చు.

5 common monsoon diseases and how to prevent them

1. డెంగ్యూ

దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ వ‌స్తుంది. అందువ‌ల్ల దోమ‌లు మ‌న ఇంటి ప‌రిస‌రాల్లో వృద్ధి చెంద‌కుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండ‌కుండా చూడాలి. ఇంట్లో దోమ తెరల‌ను వాడాలి. మ‌స్కిటో కాయిల్స్‌, రీపెల్లెంట్లు, క్రీములు ఉప‌యోగించాలి. దోమ‌లు కుట్ట‌కుండా చూసుకుంటే చాలు.. డెంగ్యూ రాకుండా ఉంటుంది.

2. డ‌యేరియా

వ‌ర్షాకాలం సీజ‌న్‌లో అప‌రిశుభ్రంగా ఉండే, క‌లుషితమైన నీరు, ఆహారాల‌ను తీసుకుంటే డ‌యేరియా వ‌స్తుంది. జీర్ణాశ‌యంలో ఇన్‌ఫెక్ష‌న్లు ఏర్ప‌డుతాయి. విరేచ‌నాలు, వాంతులు అవుతాయి. దీన్ని నివారించాలంటే శుభ్ర‌మైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం వేడిగా ఉండ‌గానే తినేయాలి. ఆహారం వండేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించాలి. బ‌య‌ట చిరుతిళ్లు, జంక్‌ఫుడ్ తిన‌డం మానేయాలి. వీలైనంత వ‌ర‌కు హోం ఫుడ్‌నే తీసుకోవాలి. ఇలా చేస్తే డ‌యేరియా రాకుండా ఉంటుంది.

3. జ‌లుబు, ఫ్లూ

వ‌ర్షాకాలంలో జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం స‌హ‌జంగానే ఎవ‌రికైనా వ‌స్తుంటాయి. దీంతో తుమ్ములు, ద‌గ్గు వ‌స్తాయి. ఇవి ఇత‌రుల‌కు జ‌లుబు, ఫ్లూ జ్వ‌రాన్ని వ్యాపింప‌జేస్తాయి. అందువ‌ల్ల ఒక‌రికొక‌రు దూరంగా ఉండాలి. ట‌చ్ చేయ‌రాదు. ఇత‌రులు వాడే ఏ వ‌స్తువునూ వాడ‌రాదు. అలాగే ఈ వ్యాధులు ఉన్న‌వారు తుమ్మినా, ద‌గ్గినా ముక్కుకు అడ్డంగా క‌ర్చీఫ్ లాంటివి పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఈ రెండు వ్యాధులూ రాకుండా ఉంటాయి.

4. టైఫాయిడ్

క‌లుషిత‌మైన నీటిని తాగ‌డం వ‌ల్ల టైఫాయిడ్ వ‌స్తుంది. దీని వ‌ల్ల జ్వ‌రం ఉంటుంది. లివ‌ర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది క‌నుక శ‌రీరం ప‌సుపు రంగులోకి మారుతుంది. ప‌రిశుభ్ర‌మైన నీటిని తాగ‌డం వ‌ల్ల ఈ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చు. చ‌ల్ల‌ని నీటిని తాగ‌డం మానేయాలి. బ‌య‌ట అమ్మే శీత‌ల‌పానీయాలు తాగ‌రాదు. నీటిని బాగా మ‌రిగించి తాగితే ఇంకా మంచిది. టైఫాయిడ్ రాకుండా ఉంటుంది.

5. క‌ల‌రా

వర్షాకాలంలో వ‌చ్చే వ్యాధుల్లో క‌లరా కూడా ఒక‌టి. ప‌రిశుభ్ర‌త‌ను పాటించ‌డం వ‌ల్ల ఈ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చు. శుభ్ర‌మైన ఆహారం తినాలి. నీరు సేవించాలి. బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చిన‌ప్పుడు, టాయిలెట్‌కు వెళ్లి వ‌చ్చాక‌.. చేతుల‌ను స‌బ్బుతో శుభ్రంగా క‌డుక్కోవాలి. ఇలా చేస్తే క‌ల‌రా రాకుండా అడ్డుకోవ‌చ్చు.

author avatar
Srikanth A

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!