NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇప్పటికీ చెక్కుచెదరని 5600 ఏళ్ల నాటి మమ్మీ.. సరికొత్త పద్ధతిలో భద్రపరిచిన ప్రాచీన ఈజిప్టియన్లు

5,600 Year Old Mummy Reveals Oldest Egyptian Embalming practice

మనందరం మమ్మీ పేరు వినే ఉంటాం. ముఖ్యంగా మమ్మీ పేరుతో సినిమా వచ్చాక మమ్మీల గురించి అందరికీ ఎక్కువగా తెలిసింది. అయితే.. మమ్మీల పేరు ఎత్తితే చాలు.. ఈజిప్టే గుర్తొస్తుంది మనకు. ఎందుకంటే అప్పట్లో ఈజిప్టియన్లు చనిపోయిన వాళ్లను సమాధి చేయకుండా తమకు తోచిన పద్ధతిలో వాళ్లను భద్రపరిచేవారు. అలా.. అవి వందల ఏళ్ల తర్వాత మమ్మీలుగా మారిపోయాయి. అందుకే.. మమ్మీలు అంటేనే ఈజిప్ట్. ఇప్పటికే మమ్మీల పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి.

5,600 Year Old Mummy Reveals Oldest Egyptian Embalming practice
5600 Year Old Mummy Reveals Oldest Egyptian Embalming practice

సినిమాల్లో చూపించేది నిజమైన మమ్మీ కాదు. అది డమ్మీ. కానీ.. నిజమైన మమ్మీని చూస్తే పడిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు అవే.

అయితే.. అప్పట్లో ప్రాచీన ఈజిప్టియన్లు మృతదేహాలను భద్రపరచడం కోసం, అవి పాడవకుండా ఉండటం కోసం ఎటువంటి పద్ధతులు ఉపయోగించేవాళ్లు.. అనే విషయంపై ఇప్పటికీ పరిశోధకులు పరిశోధన చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ.. వాళ్ల ప్రక్రియ గురించి ఇఫ్పటి వాళ్లకు ఆశ్చర్యమే కలుగుతుంది.

5,600 Year Old Mummy Reveals Oldest Egyptian Embalming practice
5600 Year Old Mummy Reveals Oldest Egyptian Embalming practice

ఎందుకంటే.. వేల ఏళ్ల క్రితం నాటి మమ్మీలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే.. ప్రాచీన ఈజిప్టియన్లు ఎటువంటి పద్ధతి ఉపయోగించారు.. అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

అయితే.. తాజాగా ఓ మమ్మీ మీద పరిశోధన చేసిన పరిశోధకులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈజిప్టియన్లు శవాలను భద్రపరచడానికి ఉపయోగించే ఎంబాల్మింగ్ అనే ప్రక్రియను శాస్త్రవేత్తలు అనుకున్న దానికంటే కూడా 1500 సంవత్సరాల ముందే ఉపయోగించారట.

5,600 Year Old Mummy Reveals Oldest Egyptian Embalming practice
5600 Year Old Mummy Reveals Oldest Egyptian Embalming practice

ఈజిప్టులోని టురిన్ మ్యూజియంలో భద్రపరిచి ఉన్న ఫ్రెడ్ అనే ఓ మమ్మీ మీద రీసెర్చర్స్ పరిశోధన చేశారు. ఫ్రెడ్ అనే మమ్మీ 5600 సంవత్సరాల క్రితానికి చెందినది. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటానికి గల కారణాలను వాళ్లు అన్వేషించారు. 1901 లో ఆ మమ్మీని టురిన్ మ్యూజియానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అది పాడవకుండా ఉండటం కోసం మ్యూజియం సిబ్బంది ఏం చేయలేదు. వంద ఏళ్లు దాటినప్పటికీ.. ఆ మమ్మీ మాత్రం ఏమాత్రం పాడవకుండా.. ఎలా ఉందో అలాగే ఉంది.

5,600 Year Old Mummy Reveals Oldest Egyptian Embalming practice
5600 Year Old Mummy Reveals Oldest Egyptian Embalming practice

దీనిపై పరిశోధన చేసి.. ఇది సాధారణంగా భద్రపరిచిన మమ్మీ కాదని.. దీన్ని ప్రత్యేక పద్ధతిలో.. సహజసిద్ధంగా ప్రాచీన ఈజిప్టియన్లు భద్రపరచారని తెలుసుకోగలిగారు. అంతే కాదు.. సాధారణంగా మమ్మీలను భద్రపరిచేటప్పుడు శరీరంలోపల ఉన్న అవయవాలన్నింటినీ తీసేసి భద్రపరుస్తారు. కానీ.. ఈ మమ్మీకి మాత్రం తన అవయవాలన్నీ తన శరీరంలోపలే ఉన్నాయి. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అలాగే మమ్మీని పడుకొబెట్టే విధానం కూడా వేరుగా ఉంటుంది. కానీ.. ఈ మమ్మీని ఢిఫరెంట్ గా పడుకోబెట్టి.. సాధారణంగా మమ్మీలను భద్రపరిచేలా కాకుండా.. వేరే పద్ధతులను ఉపయోగించి దీన్ని భద్రపరిచారు కాబట్టి.. ఎన్ని వేల సంవత్సరాలు అయినా ఆ మమ్మీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది.. అని పరిశోధకులు తేల్చారు.

author avatar
Varun G

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju