NewsOrbit
న్యూస్

దేశంలో 79 శాతం మంది స్టూడెంట్లు ఫోన్ల‌లోనే ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌రు..!

కరోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న స్కూళ్ల‌లో ఇప్ప‌టికే ఆన్‌లైన్ త‌ర‌గ‌తులను ప్రారంభించారు. క‌రోనా ఎప్ప‌టి వ‌రకు త‌గ్గుతుందో తెలియ‌దు కానీ.. స్కూళ్లు మాత్రం ఆన్‌లైన్ త‌ర‌గతుల‌ను నిర్వ‌హిస్తున్నాయి. అయితే దేశ‌వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల‌కు హాజ‌రు అయ్యేందుకు ఎక్కువ‌గా స్మార్ట్ ఫోన్ల‌నే ఉపయోగిస్తున్న‌ట్లు ఒక స‌ర్వేలో వెల్ల‌డైంది. దాదాపుగా 79 శాతం మంది ఆన్‌లైన్ క్లాసుల‌కు స్మార్ట్ ఫోన్ల‌నే వాడుతుండ‌గా, 17 శాతం మంది ల్యాప్‌టాప్ ల‌ను, మ‌రో 4 శాతం మంది ట్యాబ్లెట్ పీసీల‌ను ఆన్ లైన్ క్లాసుల‌కు ఉప‌యోగిస్తున్నార‌ని తేలింది.

79 percent of students attending to online classes through smart phones

స్కాల‌ర్‌షిప్ మేనేజ్‌మెంట్ పోర్ట‌ల్ విద్యాసార‌థి ఈ మేర‌కు దేశంలోని 400కు పైగా న‌గ‌రాల్లో ఉన్న 12 నుంచి 28 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన 10వేల మంది విద్యార్థుల‌ను స‌ర్వే చేసింది. దీంతో పై విష‌యం వెల్ల‌డైంది. ఇక ఆ విద్యార్థుల‌కు చెందిన కుటుంబాల్లో 90 శాతం మంది త‌ల్లిదండ్రులకు ఏడాదికి వ‌చ్చే ఆదాయం రూ.7 ల‌క్ష‌ల లోపే ఉన్న‌ట్లు నిర్దార‌ణ అయింది. ఇక మొత్తం విద్యార్థుల్లో 57 శాతం మందికి స‌రిగ్గా ఇంట‌ర్నెట్ ల‌భించ‌డం లేదు. అలాగే 31 శాతం మంది ఆన్ లైన్ క్లాసుల‌లో దృష్టి పెట్ట‌లేక‌పోతున్నామ‌ని తెలిపారు. మ‌రో 12 శాతం మంది ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు అర్థం కావ‌డం లేద‌ని, సందేహాలు తీర్చుకునే అవ‌కాశం లేకుండా పోయింద‌ని చెప్పారు.

కాగా మొత్తం విద్యార్థుల్లో 59 శాతం మంది ఆన్‌లైన్ క్లాసుల‌కు వాట్సాప్ వీడియో కాల్ లేదా జూమ్ యాప్ ద్వారా అటెండ్ అవుతుండ‌గా, 30 శాతం మంది విద్యార్థులు త‌మ స్కూళ్ల‌కు చెందిన సొంత ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌వుతున్నారు. నిత్యం 60 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసుల్లో 1 నుంచి 4 గంట‌ల వ‌ర‌కు స‌మ‌యం గ‌డుపుతుండ‌గా, 31 శాతం మంది 4 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు, మ‌రో 8 శాతం మంది 8 నుంచి 12 గంట‌ల వ‌ర‌కు ఆ క్లాసుల్లో బిజీగా ఉన్నారు. అయితే చాలా మంది విద్యార్థుల‌కు ఇంట‌ర్నెట్ స్పీడ్ స‌మ‌స్య‌గా మారిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ విష‌యంపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టి పెడ‌తాయో, లేదో చూడాలి.

author avatar
Srikanth A

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju