తెలంగాణలో కారు జోరే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కారు జోరుగా ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. సీఎన్ఎన్, టైమ్స్ నౌ, ఇండియా టుడే ఇలా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ తెరాస ఆధిక్యత సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.  ఇండియా టుడే అయితే టీఆర్ఎస్ కు ఏకంగా 71 నుంచి 91 స్థానాలలో తెరాస విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొనగా,  సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్ అయితే ప్రజాకూటమి- తెరాస మధ్య పోరు హోరాహోరీగా ఉందని పేర్కొంది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం టీఆర్ఎస్ 50-65 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది, ప్రజాకూటమి 38 నుంచి 52 స్థానాల మధ్య, బీజేపీ 4-7 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉండగా, ఇతరులు 10 నుంచి 17 స్థానాలలో విజయం సాధిస్తారని పేర్కొంది. ఇక టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్  ప్రకారం టీఆర్ఎస్ 66, ప్రజాకూటమి 37 స్థానాలు, బీజేపీ 7 స్థానాలలో విజయం సాధిస్తే ఇతరులు 9 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.

SHARE