బీజేపీవి ప్రమాదకర విధానాలు: అఖిలేష్

బీజేపీ చాలా ప్రమాదకర విధానాలను అనుసరిస్తున్నదని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. బులంద్ షహర్ మూక దాడి సహా  దేశంలో జరుగుతున్న పలు సంఘటనలకు ఈ పార్టీ అనుసరిస్తున్నప్రమాదకర విధానాలే కారణమని ఆయన అన్నారు. బీజేపీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనబడుతోందన్నారు. దేశంలో ద్వేషభావం, అసహనం పెచ్చరిల్లడానికి కారణం ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలే కారణమని అఖిలేష్ అన్నారు. దేశంలో బీజేపీ ప్రాభవం కోల్పోతోందన్నారు. అందుకోసమే ఏదో రకంగా పట్టు నిలుపుకోవడానికి విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.