నైట్ క్లబ్ లో తొక్కిసలాట-ఆరుగురు మృతి

ఇటలీలోని ఒక నైట్ క్లబ్ లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇటలీ తూర్పు తీరంలోని అంకోనాలోని కొరినాల్డో పట్టణంలోని  లాంటెర్నా అజ్జుర్రా అనే నైట్ ఒక నైట్ క్లబ్ లో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నైట్ క్లబ్ లో ప్రముఖ    గాయని సెఫెరా ఇబ్బాస్టా కార్యక్రమం జరుగుతుండటంతో పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది.