92 మంది పోలీస్ ల సస్పెన్షన్; హైద్రాబాద్ కమిషనరేట్ లో సంచలనం

 

 

కనిపించే మూడు సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతిరూపాలు అయితే…. కనిపించని నాలుగో సింహమే పోలీస్ అనేది అందరి మాట. తమ ప్రాణాలని సైతం లేక చెయ్యక సరిహద్దులో కాపలా కాస్తూ దేశాన్ని కాపాడేవాళ్లు ఆర్మీ జవానులు అయితే జనసంద్రంలో ఉంటూ ప్రతి క్షణం బాధ్యత, నిజాయితలతో చట్టబద్దంగా వ్యవహిరించేది పోలీస్ వ్యవస్థ. అలంటి వ్యవస్థ లో ఉద్యోగం చేస్తూ ప్రజలకి రక్షణ కలిపించి, తప్పు చేసిన వారిని సరయిన దారిలో పెట్టాల్సిన పోలీస్ లే తప్పు ద్రోవ పడుతున్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొంత మంది పోలిసుల పని తీరు ఉండడం తో వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 

telangana police

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ లో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు పరోక్షముగా, ప్రత్యక్షంగా సహకరించారన్న ఆరోపణులతో 92 మంది పోలీసులను సస్పెండ్ చేసారు నగర సిపి అంజనీకుమార్. క్రమ శిక్షణ కలిగిన శాఖలో విధులు నిర్వహిస్తూ ఎన్నికల వేళ పోలీసులు అత్యుత్సాహం చూపించారని సిపికి పలువురు ఫిర్యాదు చేయడంతో 72మంది కానిస్టేబుళ్లు, 20మంది హెడ్‌ కానిస్టేబుళ్లపై 9 రోజుల పాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఎన్నికల బరిలో నిలిచిన పార్టీలకు తమదైన శైలిలో సహకరించిన పోలీసులపై సిపి అంజనీకుమర్ విచారణ జరిపించారు. ఇందులో భాగంగా సదరు పోలీసులు రాజకీయ నాయకులతో కలిసి తిరుగుతున్న ఫోటోలను సైతం సిపి పరిశీలించారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కల్గించిన వారిపై సిపి చర్యలు తీసుకున్నారు. అయితే ఎన్నికల పోలింగ్‌కు ముందే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, పోలింగ్ విధులు నిర్వహించిన అనంతరం వారిపై చర్యలు తీసుకున్నారు. ఒక్కసారిగా 92మంది పోలీసులపై సిపి అంజనీకుమార్ వేటు వేయడంతో నగర పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

బీహార్ లో సైతం ఇలాంటి చర్యలే తీసుకుంది బీహార్ ప్రభుత్వం. నిషేధ చట్టం అమలులో నిర్లక్ష్యం, అక్రమ మైనింగ్, ఇసుక రవాణా, భూ విషయాలు అవినీతి కేసులలో ఆరోపణలు ఎదురుకుంటున్న 644 మంది అధికారులపై బీహార్ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వీరిలో ముఖ్యంగా ఉన్న 85 మంది పోలీసులను విధుల నుండి తొలిగిస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది. అవినీతికి వ్యతిరేకంగా జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ , ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రకటించింది.

bihar police

ప్రభుత్వం విడుదల చేసిన క్రమశిక్షణా, డిపార్ట్‌మెంటల్ చర్యలకు సంబందించిన నోటిఫికేషన్ లో 38 గెజిటెడ్ పోలీసు అధికారులు, ఇద్దరు ఐపిఎస్ అధికారులు ఉన్నారు. ఈ 2 ఐపిఎస్ అధికారులకు డిపార్ట్‌మెంటల్ విచారణలో దోషులుగా తేలిన తరువాత వారికి ఆదర్శప్రాయమైన శిక్ష విధించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నాన్-గెజిటెడ్ పోలీసు అధికారులు 606 మంది ఉండగా వారిలో 85 మంది పోలీసులను విధుల నుండి తొలిగించారు. అనేక గెజిటెడ్ , నాన్-గెజిటెడ్ సిబ్బందిపై కేసులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని, సత్వర చర్యలు తీసుకుంటామన్ని ప్రభుత్వం తెలిపింది.