ఆర్మీరిక్రూట్‌మెంట్‌లో 94మంది పట్టివేత

విదిష(మధ్యప్రదేశ్)జనవరి 21: ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన 94 మంది యువకులు పట్టుబడ్డారు.
పట్టుబడిన యువకులందరూ భిండ్, మొరెన, గ్వాలియర్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
అథార్‌కార్డులు, మార్కులిస్టులు, నివాస దృవీకరణ పత్రాలకు సంబంధించి తప్పుడు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సంఘటనపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు.
భోపాల్‌లోని హుజూర్కి నుండి కేవలం 25 రూపాయలతో నకిలీ పత్రాలను తయారు చేసుకుని వచ్చినట్లు ఆర్మీ, పోలీసు అధికారుల దర్యాప్తుల్లో వెల్లడైయింది.
నకిలీ పత్రాలను తయారు చేస్తున్న ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి వినాయ్ వర్మ తెలిపారు.
ఆదివారం విదిషాలో ఆర్మీరిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించారు. సోమవారం వైద్య పరీక్ష నిర్వహిస్తారు.