న్యూస్ సినిమా

పీవీ సింధుకి లవ్ లెటర్ రాసిన 70 ఏళ్ల వ్యక్తి.. ఏం అడిగాడంటే !

Share

ఇంటర్నేషనల్ లెవెల్‌లో బాడ్మింటన్‌లో ఎన్నో మెడల్స్ సాధించి భారతదేశం ఖ్యాతిని పెంచింది స్టార్ షట్లర్ పీవీ సింధు. తాజాగా ఈ దిగ్గజ ప్లేయర్ ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా ప్రోగ్రాంకి విచ్చేసింది. సాధారణంగా అలీతో సరదాగా ప్రోగ్రామ్‌కు సినీ ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులను లేదా టెక్నీషియన్స్ ను పిలుస్తుంటారు. కానీ షో లో మొదటిసారిగా ఒక నాన్ ఫిల్మ్ పర్సన్ ను పిలిచి ఆశ్చర్యపరిచారు.

అలీ షో లో పీవీ సందడి

తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల అయింది. ఈ షోలో పీవీ సింధు ఎన్నో విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. “నీకు ఇష్టమైన హీరో ఎవరు?” అంటూ అలీ ప్రశ్నించగా చాలా మంది ఉన్నారంటూ పీవీ సింధు సమాధానమిచ్చారు. అలా కాదు ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలంటూ అలీ అనగా ప్రభాస్ ఇష్టమని పీవీ సింధు సమాధానమివ్వగా, సేమ్ హైట్ ఉంటారనా? అని అలీ అనగానే పీవీ సింధు నవ్వి, ప్రభాస్, నేను మంచి ఫ్రెండ్స్ అంటూ పీవీ సింధు తెలిపారు. భవిష్యత్ లో హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా? అని అలీ అడగగా “ఏమో అవ్వవచ్చేమో” అంటూ పీవీ సింధు సమాధానమిచ్చింది. బహుశా నా బయోపిక్ లో నేనే నటిస్తానేమో అంటూ ఆన్సర్ చెప్పి తనకు నటన పై ఉన్న ఆసక్తిని వ్యక్తపరిచింది.

70 ఏళ్ల వ్యక్తి ప్రేమలేఖ

ఇప్పటి వరకు ఎన్ని ప్రేమ లేఖలు వచ్చాయి? అని అలీ అడగగా “చాలా వచ్చాయి, ఇంట్లో అందరం కూర్చుని చదువుతుంటాం, రెండు సంవత్సరాల క్రితం 70 ఏళ్ల వ్యక్తి నుంచి ఒక లవ్ లెటర్ వచ్చింది. సింధు పెళ్లికి ఒప్పుకోకపోతే.. తనని కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటానని లవ్ లెటర్‌లో రాసారు” అంటూ పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది విన్న అలీ 70 ఏళ్ళ వ్యక్తా? ఎవడు వాడు అంటూ అలీ కూడా ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేసారు. ఇక తన మాజీ కోచ్ గోపీచంద్ కు తనకు మధ్యలో వచ్చిన విబేధాల గురించి కూడా షో లో పీవీ సింధు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 22న ఈటీవీ లో ప్రసారం కానుంది.


Share

Related posts

Acharya: చిరుత పులుల్లా చిరు-చ‌ర‌ణ్ స్టెప్పులు.. ప్రోమోతోనే పిచ్చెక్కించారుగా!

kavya N

సూర్య 40 ఖరారు

Siva Prasad

 Venkateswaraswamy :  వెంకటేశ్వర స్వామి కి  ముడుపు  ఎలా కట్టాలో తెలుసుకోండి!!

siddhu