ప్రభాస్ – ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నారు. రాముడిగా ప్రభాస్ – రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. దాదాపు 750 కోట్ల భారీ బడ్జెట్ తో టి – సిరీస్ నిర్మిస్తుండగా జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ పనులన్ని శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇండియా మొత్తం ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
ప్రభాస్ మేకోవర్ అండ్ గెటప్ ఎలా ఉండబోతోంది సీత గా నటించబోయో హీరోయిన్ ఎవరూ.. ఆదిపురుష్ నుంచి మళ్ళీ అప్డేట్స్ ఎప్పుడు రానున్నాయన్న పలు విషయాలలో అభిమానులు .. ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ డిసెంబర్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా నిర్వహించనున్నారు. కాగా ఇప్పటి వరకు అటు బాలీవుడ్ లో గాని ఇటు టాలీవుడ్ లో గాని ఎంతో ఆసక్తికరంగా మాట్లాడుకున్న ప్రభాస్ ఆది పురుష్ సినిమాకి మరో స్టార్ హీరో సినిమా పోటీగా రాబోతోందని వార్తలు మొదలయ్యాయి.
ఆ హీరో నే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. గత నాలుగైదేళ్ళుగా అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో వరస సక్సస్ తో జోరు మీదున్నాడు. చెప్పాలంటే ఈ నాలుగేళ్ళలో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించినన్ని సినిమాలు మరే హీరో చేయలేదు. ఖాన్ ల త్రయం ని కూడా అక్షయ్ కుమార్ డామినేట్ చేశాడు. కాగా ఇటీవలే లక్ష్మీ అన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ మంచి హిట్ అందుకున్నాడు.
ఈ క్రమంలో మరో సినిమాని ప్రకటించాడు. ‘రామ్ సేత్’ అన్న టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు 2022 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఖచ్చితంగా ప్రభాస్ ఆది పురుష్ కి అక్షయ్ కుమార్ రాం సేతు కి భారీగా పోటీ ఉంటుందని ఇప్పటి నుంచే టాక్ మొదలైంది.