Bhola shankar: మెగాస్టార్ సినిమా అంటే ముందు అందరికీ కావాల్సింది మాస్ సాంగ్స్. మెగాస్టార్ ఎలాంటి సాంగ్ చేసిన అభిమానులు మాత్రమే కాదు ప్రతీ ఒక్కరు లేచి డాన్స్ వేయాల్సిందే. ఇప్పటికీ చిరు నటించిన ఘరాన మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, డాడీ, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, హిట్లర్, శంకర్ దాదా సిరీస్ ఇటీవల వచ్చిన ఖైదీ నంబర్ 150 సినిమాలతో పాటు ఓల్డ్ మూవీస్‌లో సూపర్ హిట్స్ సాంగ్స్ మోగుతూ ఉంటాయి. సిటీకంటే కూడా విలేజెస్లో మెగాస్టార్ సాంగ్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి.
అంత క్రేజ్ ఉన్న మెగాస్టార్ సినిమాలలోని సాంగ్స్‌కు డాన్స్ కంపోజ్ చేసే ఛాన్స్ కోసం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్స్ అందరూ ఎంతో ఆతృతగా సీనియర్ డాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్ దగ్గర్నుంచి ఆయన కొడుకులు ప్రభుదేవా, రాజు సుందరం, రాఘవ లారెన్స్..ఇప్పుడున్న శేఖర్ మాస్టర్ సహా ఎంతోమంది చిరుతో పనిచేసి ఎంజాయ్ చేసినవారే. ఆయన సినిమాలకు సాంగ్స్ కంపోజ్ చేయడం అంటే డబుల్ ఎనర్జీ వచ్చేస్తుంది ఏ డాన్స్ మాస్టర్కైనా. అంతేకాదు స్టెప్స్ అన్నీ ఎంతో ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు.
Bhola shankar: వీరందరూ డాన్స్ మాస్టర్స్‌గా మాత్రమే కాదు చిరు అభిమానులు..
వీరందరూ డాన్స్ మాస్టర్స్‌గా మాత్రమే కాదు చిరు అభిమానులుగానూ ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంటారు. అందుకే చిరు ప్రతీ కొరియోగ్రాఫర్‌కు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తుంటారు. అలా ఇప్పుడు మూడవసారి మాంచి మాస్ సాంగ్ కొరియోగ్రఫీ అందించే అవకాశం అందుకున్నాడు శేఖర్ మాస్టర్. ఖైదీ నంబర్ 150. ఆచార్య సినిమాలలో చిరుతో అద్భుతమైన స్టెప్స్ వేయించిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో సాలీడ్ మాస్ సాంగ్‌ను కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్ రిహార్సల్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిరుతో కలిసి ఉన్న పిక్‌ను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా, తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్‌గా రూపొందుతోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!