న్యూస్ వీడియోలు

మై నేమ్ ఈజ్ రాగా!

Share

రాజకీయ నాయకుల జీవితాలు ఆధారంగా చిత్రాలు నిర్మించే ధోరణి ఎక్కువవుతోంది. ఈ బయోపిక్‌ల పరంపరకు మరొకటి వచ్చి చేరుతోంది. ఈసారి బయోపిక్‌ రాహుల్ గాంధీ జీవితంపై. సినిమా పేరు ‘మై నేమ్ ఈజ్ రాగా’ (My Name is RaGa). రూపేష్ పాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఏప్రిల్‌లో సినిమా విడుదల అవుతుందని పాల్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీని గొప్పగా చిత్రించడానికి ఈ సినిమా తీయడం లేదని పాల్ ఇండియా ఎబ్రాడ్ న్యూస్ సర్వీస్‌కు చెప్పారు. వైఫల్యాన్ని భయం లేకుండా ఎదుర్కొన్నవారు ఎవరైనా ఈ సినిమా చూసి తమ గురించే అనుకోగలరు అని పాల్ చెప్పారు. నిజానికి ఇది బయోపిక్ కాదు, వరుస వైఫల్యాల తర్వాత అజేయుడిగా మారిన ఓ వ్యక్తి కథ అన్నారు పాల్.

నెల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై బయోపిక్ వచ్చింది. బాల్ థాకరే జీవితంపై మరో బయోపిక్ ఇటీవలే రిలీజ్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా కూడా ఒక సినిమా తీస్తున్నారు.


Share

Related posts

Warts: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు..!! పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి..!!

bharani jella

బ్రేకింగ్ : ఆస్ట్రియాలో ఉగ్రదాడి …!!

Vissu

ఇస్మార్ట్ బ్యూటీకి అదిరిపోయేలా ఆఫర్ ఇచ్చిన పవర్ స్టార్.. ఇక టాలివుడ్ లో స్టార్ హీరోయిన్ అవడం ఖాయం ..?

GRK

Leave a Comment