రాశీఖన్నా టాలీవుడ్ లో మళ్ళీ బంపర్ ఆఫర్ కొట్టేసిందా.. అవుననే మాట వినిపిస్తోంది. అంతేకాదు మెగా హీరో తో కలిసి హ్యాట్రిక్ సినిమా చేయబోతుండటమే కాదు హ్యాట్రిక్ హిట్ కూడా గ్యారెంటీ గా అందుకోవడం పక్కా అంటున్నారు. బబ్లీ బ్యూటీ rasikhanna కి మెగా హీరో sai dharam tej మరోసారి నటించే అవకాశం ఇచ్చాడని లేటెస్ట్ అప్డేట్. ఇప్పటికే సాయి ధరం తేజ్ తో రాశీఖన్నా అనిల్ రావిపూడి దర్శకత్వంలో లో వచ్చిన సుప్రీం..మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతీరోజూ పండుగే సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలు అటు సాయి ధరం తేజ్ కి ఇటు rasikhanna కి తమ ఖాతాలలో మంచి హిట్ గా నమోదయ్యాయి. అందుకే మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారట.
ప్రస్తుతం rasikhanna కి కోలీవుడ్ లో వరసగా అవకాశాలు వస్తున్నాయి. రాశీఖన్నా చేతిలో 4 తమిళ సినిమాలున్నాయని అంటున్నారు. చెప్పాలంటే రాశీఖన్నా ఈ 4 నాలుగు సినిమాలతో బిజీగానే ఉంది. కాని తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోవడం తో రాశీఖన్నా కెరీర్ గాడి తప్పిందని ప్రచారం చేస్తున్నారు. చెప్పాలంటే విజయ్ దేవరకొండ తో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా rasikhanna కెరీర్ మీద గట్టిగానే ప్రభావం చూపించింది. ఆ తర్వాత రాశీఖన్నా ని అంతగా పట్టించుకోవడం లేదంటున్నారు.
రీసెంట్ గా మారుతి – గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకోసం rasikhanna ని తీసుకోవాలని మేకర్స్ అనుకున్నప్పటికి.. గోపీచంద్ వద్దన్నాడని వార్తలు వస్తున్నాయి. gopichand తో రాశీఖన్నా రెండు సినిమాలు చేసింది. వాటిలో జిల్ సినిమా యావరేజ్ గా నిలిచింది. మరో సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం రాశీఖన్నా ఫాం లో లేకపోవడం తో గోపీచంద్ రిజెక్ట్ చేశాడని అన్నారు. అయితే rasikhanna కి అనూహ్యంగా మెగా హీరో అవకాశం ఇచ్చాడట. సుకుమార్ రైటింగ్స్ లో నిర్మించే సినిమాలో సాయి ధరం తేజ్ కి జంటగా రాశీఖన్నా ని తీసుకున్నారని సమాచారం. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుందట. ప్రస్తుతం సాయి ధరం తేజ్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.