అమితాబ్ బచ్చన్ స్కూల్ లో చదువుకునే రోజుల్లో మిత్రులతో కలిసి సరదగా ఆడుకోవడం, కొంటె పనులు చేయడం లాంటివి చేశారట. చిన్నప్పుడు తాను చెప్పిన ఓ అబద్దం కారణంగా ప్రిన్సిపాల్ ఇచ్చిన పనిషిమెంట్ గురించి ఒక సందర్భం లో ఇలా చెప్పుకొచ్చారు.
నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ తో కలిసి ఓ పాము పై దాడి చేసి చంపేశాం.అయితే ఆ రోజుల్లో పామును చంపడమంటేమాములు విషయం కాదు. అయితే పామును చంపింది మేము కాదని వేటగాడు చంపాడని, అందర్నీ నమ్మించాము. తర్వాత ఆ పామును హాకీ స్టిక్ కు తగిలించి స్కూల్ గ్రౌండ్ అంతా తిరిగాము. ఈ విషయం తెలిసిన మా ప్రిన్సిపాల్ మమ్మల్నందరిని గదిలో కి పిలిచారు. మా ప్రిన్సిపాల్ ఒక బ్రిటీషియన్ . స్కూల్ అంతా బ్రిటీష్ వాతావరణం తో ఉండేది. దానితో పాటు ఆయన చాల ఉండేవారు.క్రమశిక్షణ తో స్ట్రిక్ట్ గా, ఉండేవారు.
పామును చంపిన విషయాన్ని తెలుసుకుని మీరు తప్పు చేశారా అని గట్టిగా గద్దించి అడిగారు. దీంతో నేను తడుముకున్నాను .. ఆయనకు విషయం అర్ధమై ఆరు కోతలు పెట్టండి అని గట్టిగా చెప్పి వెళ్లిపోయారు’. ‘ఎవరు తప్పు చేసినా శిక్షించ డానికి మా స్కూల్ లో ఓ గ్యారేజ్ ఉండేది. అక్కడ విద్యార్థులను నూనె పూసిన కర్రలతో కొట్టేవారు. మమ్మలందర్నీ కూడా వంగమని చెప్పి ఆ కర్రలతో వీపు పై కొట్టారు.
ఇప్పుడు నవ్వుకుంటున్నను కానీ అప్పుడు మాత్రం చాలా బాధ పడ్డాను. ఇక్కడ ఇంకా నవ్వు వచ్చే సంఘటన ఏమిటంటే కొట్టడం పూర్తయిన తర్వాత ప్రిన్సిపాల్ మమ్మల్ని థ్యాంక్యూ చెప్పమని అడిగారు. ఈ సంఘటన గుర్తు వస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది’ అని అమితాబ్ తన చిన్ననాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.