NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Kerala : కేరళ సీఎం పై ఓ సామాన్యురాలు పోటీ!ఆమె అంత వరకూ ఎందుకు వచ్చిందంటే?

Kerala : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి తో ఓ సామాన్యురాలు పోటీకి దిగింది .ఇదే ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.సీఎంను ఢీకొనడమ౦టే మామూలు విషయం కాదు.మరి ఆ సామాన్యురాలు ఎందుకంత సాహసం చేసింది అన్నదే ఇక్కడ వార్తాంశం.ఒక హృదయవిదారక గాధే ఆమెను అందుకు పురికొల్పింది. ఇద్దరు కూతుర్లను కోల్పోయిన ఆ తల్లి ఈ విషయంలో తనకు ముఖ్యమంత్రి న్యాయం చేయలేదన్న ఆవేదనతో ఆయనపైనే పోటీకి ఎన్నికల బరిలోకి దిగింది.వివరాల్లోకి వెళితే ..

A commoner competes against the Kerala CM!
A commoner competes against the Kerala CM!

Kerala : ఆమెది గుండెలు పిండేసే వ్యథ!

కొన్ని ఎన్నికల గుర్తులు మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొన్ని ఆలోచింపజేస్తుంటాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో ఓ క్యాండిడేట్‌‌కు ఇచ్చిన ఫ్రాక్ సింబల్‌‌ అక్కడి జనాలను కంటతడి పెట్టిస్తోంది. ఓ విషాద సంఘటనను గుర్తు చేస్తోంది. కేరళలోని వలయార్‌‌లో 2017లో అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు అమ్మాయిల (13, 9 ఏళ్లు)పై కొందరు అత్యాచారం చేసి చంపేశారు. 13 ఏండ్ల చిన్నారిపై 2017 జనవరిలో అత్యాచారం చేసి ఆమె ఇంట్లోనే దూలానికి వేలాడదీశారు. 2 నెలల తర్వాత ఆ అమ్మాయి చెల్లెలు కూడా ఇలానే వేలాడుతూ కనిపించింది. దీనిపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ చిన్నారుల తల్లే ఇప్పుడు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌‌కు పోటీగా ధర్మదాం నుంచి బరిలో దిగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు ఫ్రాక్ గుర్తు వచ్చింది.

ఎందుకు పోటీకి దిగాన౦టే!

‘నా కుటుంబానికి జరిగిన అన్యాయంపై సీఎం అసలు మాట్లాడలేదు. ఆయనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడేందుకు, నా కూతుళ్లకు న్యాయం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఎమ్మెల్యేనో, మినిస్టరో అవడానికి కాదు’ అని ఆ చిన్నారుల తల్లి చెప్పారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని 2019లో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తీర్పుపై ఆందోళనలు వెల్లువెత్తడంతో కేరళ సర్కారు హైకోర్టులో అప్పీలు చేసింది. తన కూతుర్లకు న్యాయంచేయాలని ఆందోళన చేస్తున్న ఆ చిన్నారుల తల్లి.. జనవరి 26 నుంచి పాలక్కడ్‌‌లో సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. గత నెల గుండు గీయించుకుని నిరసన తెలిపారు.ఇప్పుడు ఆమె ఏకంగా సీఎంతోనే పోటీకి దిగారు.గెలుపోటములను పక్కనపెడితే ఆ తల్లి కడుపుకోత కి ఆమె నిర్ణయం అద్దం పడుతోంది.

 

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju