Sekhar Master : శేఖర్ మాస్టర్ Sekhar Master గురించి తెలుసు కదా. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే టాప్ కొరియోగ్రాఫర్. ఆయన తర్వాతనే ఎవ్వరైనా. మెగాస్టార్ చిరు దగ్గర్నుంచి.. యువ హీరోల వరకు అందరికీ కొరియోగ్రఫీ చేసేది శేఖర్ మాస్టరే. ఓవైపు షూటింగ్ లతో ఫుల్ టు బిజీగా ఉంటే శేఖర్ మాస్టర్ మరోవైపు కొన్ని షోలలోనూ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. స్టార్ మాలో కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ లోనూ జడ్జిగా వ్యవహరిస్తుంటారు.

మొత్తం మీద శేఖర్ మాస్టర్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక అభిమానం ఉంటుంది. దాన్ని ఎప్పుడూ శేఖర్ మాస్టర్ కూడా పోగొట్టుకోరు. చాలా సింపుల్ గా ఉంటారు.
Sekhar Master : షూటింగ్ లేకపోతే.. ఆ రోజు మొత్తం ఫ్యామిలీతోనే
శేఖర్ మాస్టర్ ఎంత బిజీనో అందరికీ తెలుసు. ప్రతి రోజూ ఏదో ఒక షూటింగ్ ఉంటూనే ఉంటుంది. కానీ.. ఒక్క రోజు మాత్రం శేఖర్ మాస్టర్ కు ఖాళీ దొరికింది. ఆ రోజు షూటింగ్స్ గట్రా ఏవీ లేకపోవడంతో.. శేఖర్ మాస్టర్ ఆ రోజు మొత్తం ఫ్యామిలీ కోసమే స్పెండ్ చేశారు. ఫ్యామిలీతో సరదాగా గడిపారు.
ఉదయం 10 గంటలకు నిద్ర లేచి.. ముఖం కడుక్కొని ఫ్రెష్ గా టిఫిన్ చేసి ఆ తర్వాత కాసేపు తన కుక్క పిల్లలతో ఆడుకొని ఆ తర్వాత లంచ్ చేసి.. కాసేపు తన ఆఫీసుకు వెళ్లి వచ్చి.. ఆ తర్వాత సాయంత్రం పూట కాసేపు జిమ్ కు వెళ్లి వచ్చి.. రాత్రి మళ్లీ ఫ్యామిలీతో సరదాగా కాసేపు స్పెండ్ చేసి నిద్రపోవడం.. ఇదే శేఖర్ మాస్టర్ ఇంట్లో ఉంటే చేసే పనులు. షూటింగ్ లేకపోతే.. ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండటానికి మాస్టర్ ఆసక్తి చూపిస్తారు.
షూటింగ్ లేకపోతే.. ఒక రోజు ఇంట్లో ఏ చేస్తాను.. అనే క్యాప్షన్ తో శేఖర్ మాస్టర్ ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా దానిపై ఓ లుక్కేయండి.