prabhas : ప్రభాస్ సినిమాకి భారీ సెట్..అంతా నేచురల్ అట..!

Share

prabhas : ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ ఏ రేంజ్ లో తెరకెక్కుతున్నాయో ఆయా చిత్ర యూనిట్ ఇస్తున్న అప్‌డేట్స్ తోనే అర్థమవుతోంది. బాహుబలి సినిమా ముందు వరకు ప్రభాస్ చేసినవన్నీ పక్కా కమర్షియల్ సినిమాలే. మొదటి సినిమా ఈశ్వర్ నుంచి సాహో వరకు..ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నాలుగు సినిమాలతో కలిపి అన్నీ వైవిధ్యమైన కథలే. యాక్షన్ సినిమా చేసినా..లవ్ స్టోరీ చేసినా.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేసినా ప్రభాస్ కి సాటి ఎవరూ రారు. ఇక ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్‌లో నటిస్తున్న మొదటి పౌరాణిక సినిమా.

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ సాహో సినిమాతో చైనా, జపాన్ వంటి దేశా‌లలోనూ అభిమానులు..అభిమాన సంఘాలు ఏర్పరుచుకున్నాడు. అందుకే ప్రభాస్ పాన్ ఇండియన్ స్థాయిలో ఉండే సినిమాలని మాత్రమే ఒప్పుకుంటున్నాడు. ప్రభాస్ సినిమాతోనే టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు మొదలయ్యాయి. 250 కోట్ల పైనే బడ్జెట్‌ని నిర్మాతలు ప్రభాస్ సినిమాకి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసి సలార్, ఆదిపురుష్ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు.

prabhas : మొత్తంగా చూస్తే ప్రభాస్ సినిమాలకి భారీ సెట్స్ అన్నవి తప్పనిసరి అవుతున్నాయి.

అయితే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ కోసం ముంబైలో భారీ సెట్స్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. పౌరాణిక కథాంశం కావడంతో ఎక్కువగా భారీ గ్రీన్ మ్యాట్ సెట్స్‌ని నిర్మించారట. అందులో భాగంగానే సహజంగా ఉండే పెద్ద ఫారెస్ట్ సెట్‌ని నిర్మించినట్టు తాజా సమాచారం. ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నారు. రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. అంతేకాదు సలార్ తో పాటు వైజయంతీ మూవీస్ 50వ సినిమాకి భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారట. మొత్తంగా చూస్తే ప్రభాస్ సినిమాలకి భారీ సెట్స్ అన్నవి తప్పనిసరి అవుతున్నాయి.


Share

Related posts

ఆన్ లైన్ ట్రాజెడీకి బాధ్యులెవరు? 

sekhar

కమలం వైపు కదులుతున్న పనబాక దంపతులు? కానీ ఒకే ఒక్క కండిషన్ !!

Yandamuri

Nimmagadda Ramesh Kumar : పదవి కాలం చివరి రోజు కీలక వ్యాఖ్యలు చేసిన నిమ్మగడ్డ..!!

sekhar