Naga sourya : సినిమా ఇండస్ట్రీలో ఎంత కొత్తగా తమ సినిమాను పబ్లిసిటీ చేస్తే అంతగా జనాలను ఆకర్షించవచ్చన్న ప్లాన్స్ బాగానే రాస్తుంటారు. రిలీజ్ కి ముందు సినిమాను జనాలలోకి ఎంతగా తీసుకువెళితే అంతగా ఆసక్తి పెంచవచ్చని భావిస్తుంటారు. ఇప్పుడు కోవిడ్ వల్ల జనాలలో థియేటర్స్ కి రావాలన్న ఆసక్తి తగ్గిపోయింది. ఓటీటీలో రిలీజ్ చేసిన అంతగా రెస్పాన్స్ వస్తుందనేది గ్యారెంటీగా చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో సినిమాను ఎక్కడ రిలీజ్ చేసినా కూడా జనాలను ఆకట్టుకోవాలంటే పబ్లిసిటీ కొత్తగా ప్లాన్ చేయాలి. అదే నాగ శౌర్య బృందం ప్లాన్ చేసింది.
ఆయన హీరోగా నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం లక్ష్య. ప్రాచీన విలువిద్య (ఆర్చరీ క్రీడ) బ్యాక్ డ్రాప్ రూపొందిస్తుండగా ఈ సినిమాను ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇక నాగ శౌర్య ఇందులో ఇప్పటి వరకు కనిపడని ఓ సరి కొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఒకవైపు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగ శౌర్య ‘లక్ష్య’ సినిమా ప్రమోషన్స్ కూడా చిత్ర బృందం మొదలు పెడుతున్నారు. అది కూడా ప్రతీ శుక్రవారం. అవును వారం వారం ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నారు.
Naga sourya : #LAKSHYASFRIDAY అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రతీ శుక్రవారం ఒక అప్డేట్
#LAKSHYASFRIDAY అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రతీ శుక్రవారం సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్దం అవుతున్నారు. కాగా ఈ సినిమాలో నాగశౌర్య కి జంటగా రొమాంటిక్ హీరోయిన్ మూవీ కేతిక శర్మ నటిస్తోంది. అంతేకాదు విలక్షణ నటుడు జగపతి బాబు, సచిన్ కేడ్కర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ప్రముఖ నిర్మాత సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ – నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!