Oscars 2021 : ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన అవార్డు ఆస్కార్. కచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ సాధించాలని సినీ నటులకు అదేవిధంగా డైరెక్టర్లకు నిర్మాతలకు ఉంటుంది.
అటువంటి ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవానికి ఈ ఏడాది ఇండియన్ షార్ట్ ఫిలిం ఒకటి నామినేట్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే నట్కాట్’ పేరుతో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ కు నామినేట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2019 వ సంవత్సరం లో ఈ షార్ట్ ఫిలిం రూపొందించగా తాజాగా ఆస్కార్ ఉత్తమ షార్ట్ ఫిలిం విభాగంలో సెలెక్ట్ అయింది. నట్కాట్’ పేరుతో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ నటించడం జరిగింది. అయితే తాజాగా ఆస్కార్ కు నామినేట్ కావడంతో ఈ విషయాన్ని విద్యాబాలన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తాను నటించిన షార్ట్ ఫిలిం ఆస్కార్ అవార్డ్ కి నామినేట్ కావడం గర్వంగా ఉందని పేర్కొంది. ఈ ఏడాది 93 వ ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుకలు ఏప్రిల్ 25 వా తారీకు న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నట్కాట్ ఆస్కార్ బరిలో చివరి వరకు నిలుస్తుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన షార్ట్ ఫిలిం ఆస్కార్ కు నామినేట్ కావడం నిజంగా గర్వించదగ్గ విషయమని సోషల్ మీడియాలో నెటిజన్లు నట్కాట్ షార్ట్ ఫిలిం యూనిటీ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. భారతీయులు ఎంతగానో గర్వించదగ్గ విషయమని కామెంట్లు పెడుతున్నారు.