Singer Sunitha: సింగర్ సునీత తెలియని తెలుగు ప్రజలు వుండరు అంటే నమ్మి తీరాలి. అంతలా ఆమె తన పాటలతో జనాలను అలరించింది. అంతేకాకుండా ఆమె డబ్బింగ్ రంగంలో కూడా తన ఉనికిని చాటుకుంది. తియ్యని ఆమె గొంతంటే మన తెలుగు వాళ్లకు ఓ తియ్యని అనుభూతి. ఆమె పడిన “అసలేం గుర్తుకు రాదు.. నా కన్నుల ముందు నువ్వు ఉండగా!” అనే పాట తన జీవితాన్నే మార్చివేసింది. అంతఃపురం సినిమా సక్సెస్ విషయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది అందంలో అతిశయోక్తి లేదు.
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 కీ త్రివిక్రమ్ కీ సంబంధం ఏంటి .. బ్లాక్ బస్టర్ న్యూస్ వచ్చింది చూడండి
Singer Sunitha: సింగర్ సునీతపై తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు ఇవే..
ఇకపోతే సింగర్ సునీత కొన్నాళ్ల క్రితం రామ్ అనే డిజిటల్ కంపెనీ ఓనర్ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసినదే. ఈ క్రమంలోనే సునీత గర్భవతి అని కొన్ని సోషల్ మీడియాలు కోడై కూస్తున్నాయి. అక్కడితో ఆగకుండా ఆమె సరోగసి ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఆమె భర్తకు చెందినటువంటి డిజిటల్ కంపెనీలోకి సునీత కూడా ఎంటర్ కానుందనే వార్తలు వస్తున్నాయి.
Tharman: సినీ ఇండస్ట్రీలో కలవరాన్ని రేపుతున్న కరోనా..! తాజాగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి..!!
సునీత – రామ్ పైన వస్తున్న మరో వార్త ఏమంటే?
సునీత భర్త రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో వున్నారని, వాటికి సునీతనే నిర్మాతగా వ్యవహరించే విధంగా రామ్ ప్లాన్ చేస్తున్నాడని, అలాగే బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్‌లను ప్లాన్ చేస్తున్నారనే విషయాలు ఇపుడు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. ఈ విషయాలు ఓకే. కానీ సునీత, తాను ఎక్కడా గర్భం దాల్చానని, లేదా సరోగసి విధానం ద్వారా పిల్లలను కంటానని చెప్పలేదు. అయితే తాజాగా వస్తున్న ఈ విషయంపైన సునీత కొంచెం అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.