ఈ రోజుల్లో చాల మందికి పోర్న్ చూడడం ఒక అలవాటుగా మారింది.. పెళ్లి కానీ వారు, ఒక వేళ పెళ్లి అయిన తర్వాత కూడా భాగస్వామి దగ్గర లేని వారు వాటిని చూడటం సర్వ సాధారణం అయిపోయింది. అయితే ఈ చూడడం అనేది ఎంత మోతాదులో ఉందో పరిశీలించుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువమంది యువత దీనికి బానిసలుగా మారిపోయారు. ఆ వీడియోలు చూడకుండా ఉండలేం అన్నంతగా బానిసలూగా తయారైన వారూ కూడా ఉన్నారు.
ఒంటరితనం విచ్చలవిడిగా ఇంటర్నెట్ వాడడం వంటివి పోర్న్ వీడియోలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎలాంటి ప్రయోజనం లేక పోగా పోర్న్ వీడియోల వాడకం తగ్గడం లేదు. ఎన్ని వెబ్సైట్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నా కూడా కొత్త కొత్తవి పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆ వీడియోలను చూస్తూ యువత చెడు మార్గం లో వెళ్తున్నారు. అయితే, కొన్ని నెలల కిందట చేసిన ఒక సర్వే లో ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
హైదరాబాద్‌లో సగం కంటే ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులు పోర్న్‌కు బానిసలుగా ఉన్నారటా. ‘ఎ స్టడీ ఆన్ ఇంటర్నెట్ అడిక్షన్ ఎమాంగ్ యంగ్ అడల్ట్స్ ఇన్ హైదరాబాద్’ పేరుతో 18 నుండి 25 ఏళ్ల మధ్య యువతీ యువకులను సర్వే చేయగా తాము పోర్న్‌కు బానిసలం కాలేదని యువతులు తెలియచేసారు. యువకులు మాత్రం 57 శాతం మంది తాము క్రమం తప్పకుండా పోర్న్ వీడియోలు చూస్తామని తెలిపారట.
అయితే, పోర్న్ చూడడం అనేది ఒక వ్యసనం గా మారితే ఆత్రుత, నిరాశ, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలకు కారణమవుతుందని తాజా సర్వే వెల్లడించింది. ఈటింగ్ డిసార్డర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. పోర్న్ ఎక్కువగా చూడటం వల్ల భవిష్యత్తు లో భాగస్వామి తో శృంగారం చేసే సమయంలో అంగ స్తంభన సమస్యలకు దారి తీస్తుందని తెలియచేస్తున్నారు.