పరుషులకు అయినా స్త్రీల కి అయినా శృంగారం అంటే ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. శృంగార మధురానుభూతిని ఆస్వాదించాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా నే ఉంటుంది.అన్నీ అనుకూలం గా ఉంటే శృంగారం లో పాల్గొనేందుకే చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. కాని ఈ విషయం లో సర్వే నిర్వహించిన ట్రావెల్ ప్లాట్‌ఫామ్ భిన్నమైన ఫలితాల గురించి తెలియచేసింది.
కొత్తగా చేసిన సర్వేలో ఆస్ట్రేలియాకు చెందిన స్త్రీలు, పురుషులు తమకు శృంగారం కంటే హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడమే ఎక్కువ అనుభూతిని ఇస్తుంది అని తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన 1000 మంది తమ అభిప్రాయాలు ఓ ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వేలో పంచుకున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న 57 శాతం మంది శృంగారం కంటే హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికే ఎక్కువ ఇష్టం చూపగా… 25 శాతంమంది మాత్రం శృంగారం కావాలని చెప్పారు.
7 శాతం మంది మాత్రం ఎక్సర్సైజ్లు మీద 6 శాతం మంది మాత్రం బిగ్ నైట్ ఔట్లపై ఆసక్తి చూపారు. అయితే ఇక్కడ గమనించ వలిసిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సర్వేలో పురుషుల కంటే స్త్రీ లే శృంగారం పై ఆసక్తి చూపించినట్టు తెలిసింది. 69 శాతం ఆడవారు శృంగారం కోరుకోగా… మగవారిలో కేవలం 45 శాతం మంది మాత్రమే హాలీడేస్ కంటే శృంగారం బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేసారు. హాలీడేస్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారిలో 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు 64 శాతం ఉండగా… 18 నుంచి 24 మధ్య వయసున్న వారిలో శృంగారం పై ఆసక్తి 46 శాతం ఉంది.
45 నుంచి 54 ఏళ్ల వయసున్న వారే ఎక్కువ శాతం శృంగారం పై ఆసక్తి చూపడం ఇక్కడ గమనించవలిసిన విషయం. వీరి శాతం 30కు పైగా ఉంది. ఇక శృంగార కోరికలు ఎక్కువగా ఉండే 18 నుంచి 24 ఏళ్ల వయసున్న వాళ్లు కేవలం 20 శాతం మంది మాత్రమే ఉండటం ఇక్కడ ఆసక్తికరమైన అంశం.