Aacharya Movie : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా..తిరుగులేని ట్రాక్ రికార్డు కలిగిన కొరటాల ఈ సినిమాలో ప్రతి సన్నివేశం హైలెట్ అయ్యేలా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందట. అంతకు ముందే భరత్ అనే నేను సినిమా చేసినా కొరటాల అదేస్థాయిలో “ఆచార్య” సినిమా కూడా ఉండేవిధంగా మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో చిరంజీవి పాత్ర సినిమాలో ఉండేలా కొరటాల జాగ్రత్త పడినట్టు ఇండస్ట్రీ టాక్.
స్క్రీన్ మీద ప్రతి సన్నివేశం చూసిన మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విధంగా..కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ఇదిలా ఉంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ సినిమా కి మెగా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్న నేపద్యంలో ఆచార్య మ్యూజిక్ రేట్స్ ఆదిత్య సంస్థ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
Aacharya Movie ఆడియో హక్కుల కోసం
సినిమా ఆడియో హక్కుల కోసం కొన్ని కోట్లు ఇచ్చి ఆదిత్య సంస్థ ఆడియో హక్కులను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే లాక్డౌన్ తర్వాత స్టార్ట్ అయిన సినిమా షూటింగ్ ఎట్టి పరిస్థితిలో ఆగిపోకుండా షెడ్యూల్ తో..శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే సినిమాల్లో సిద్ధ అనే పాత్రలో చరణ్ నటిస్తున్నాడట.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు కొన్ని కీలక సన్నివేశాలు వచ్చే నెలాఖరు లోపు తీసి రేపు 13వ తారీఖున సినిమా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇదిలాఉంటే ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అదిరిపోయే రీతిలో ఉండటంతో అనుకున్న అంచనాల కంటే మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు మెగా అభిమానులు.