Subscribe for notification

Aacharya: సిద్ద వచ్చాడు…అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళాడు

Share

Aacharya: మెగాస్టార్ చిరంజీవి – కాజల్ అగర్వాల్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద అనే కీలక పాత్రలో నటించాడు. ఆయనకు జంటగా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చివరికి చేరుకున్న ఆచార్య సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్రబృందం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ పోషిస్తున్న సిద్ద పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.

Aacharya siddha teaser released

ఈ టీజర్ చూస్తుంటే మెగా అభిమానులకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. కేవలం సిద్ద పాత్రను హైలెట్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆచార్యపై భారీ అంచనాలు పంచాయి. సిద్ద పాత్ర ముందు 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే ఉండగా ఆ పాత్రను చరణ్ చేసేందుకు ఒప్పుకోగానే 1 గంట వరకు ఉండేలా కొరటాల కథలో మార్పులు చేసి చిరు – చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద అదరగొట్టేలా కీలక సన్నివేశాలను పెంచారు. అంటే సినిమాలో  చరణ్ పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

Aacharya: మెగాస్టార్ – మెగా పవర్ స్టార్‌లను ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో చిన్న శాంపిల్ సిద్ద టీజర్..

ఆ ప్రాధాన్యతను తాజాగా రిలీజ్ చేసిన సిద్ద పాత్ర టీజర్‌తో అర్థమవుతోంది. ధర్మస్థలిని కాపాడుకునే వ్యక్తిగా రామ్ చరణ్ సిద్ద పాత్రలో నటించాడని తాజా టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ చివరిలో ఓ వైపు చిరుత పులి, దాని పిల్ల ఉంటే మరోవైపు చిరు – చరణ్‌లను చూపించడం పెద్ద హైలెట్ అని చెప్పాలి. ఇది మెగా అభిమానులకు పెద్ద సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కొరటాల ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ – మెగా పవర్ స్టార్‌లను ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో చిన్న శాంపిల్ సిద్ద టీజర్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను 2022, ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.


Share
GRK

Recent Posts

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

55 mins ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

2 hours ago

Pakka Commercial: భారీగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే గోపీచంద్ ఎంత రాబ‌ట్టాలి?

Pakka Commercial: మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా…

2 hours ago

Major: ఓటీటీలో `మేజ‌ర్‌` సంద‌డి.. అనుకున్న దానికంటే ముందే వ‌స్తోందిగా!

Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `మేజ‌ర్‌`.…

3 hours ago

Kuppam: కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేది ఎవరో క్లారిటీ ఇచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి..ఎవరంటే..?

Kuppam: రాబోయే ఎన్నికల్లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)ను ఆయన సొంత నియోజకవర్గం కుప్పం లో ఓడించాలని వైసీపీ (YCP)వ్యూహంతో…

4 hours ago

Leaves: ఈ ఆకులతో అదిరిపోయే ప్రయోజనాలు ఉంటాయని ఊహించారా.!?

Leaves: అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో సపోటా కూడా ఒకటి.. అధిక పోషకాలు కలిగి ఉన్న ఈ పండు…

4 hours ago