NewsOrbit
న్యూస్

ఆధార్ సెంటర్ కు వెళ్ళనవసరం లేదు.. హెల్ప్ లైన్ కు కాల్ చేయండి..

 

 

ఈ రోజుల్లో ప్రతి చిన్న పనికి ఆధార్ కార్డు తప్పనిసరి.. అయితే మీ ఆధార్ కార్డు లో ఏమైనా తప్పులు ఉన్నాయా..? మార్పులు చేసుకోవాలా..? ఆధార్ కార్డు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా..? హ.. ఉంటే మాత్రం ఎవరు నివృత్తి చేస్తారు..? ఆధార్ సెంటర్ కి వెళ్లడం తప్ప.. అని అనుకుంటున్నారా..? ఇప్పుడు ఆధార్ సెంటర్ కు వెళ్లవలసిన అవసరం లేదు‌.. హెల్ప్ లైన్ నెంబర్ కు ఒక ఫోన్ కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు..!

 

aadhar card

ప్రయాణం చేయాలన్నా, ఎగ్జామ్ రాయాలన్నా, బ్యాంకులో నగదు డ్రా చేయాలన్నా ఇలా ప్రతి దానికి ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు. మన ఆధార్ కార్డు లో ఎటువంటి మార్పులు, చేర్పులు లేకపోతే సరే. అదే ఒక చిన్న అక్షరం తప్పు పడిన, ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోయినా ఆధార్ సెంటర్ కి వెళ్లి వారు సూచించిన సంబంధిత పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అయితే ముందుగానే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమో తెలిస్తే వెళ్తూ వెళ్తూ వాటిని తీసుకెళ్లవచ్చు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆధార్ సెంటర్ కి వెళ్లి ఇంటికి వచ్చి మరలా తీసుకువెళ్లడం కష్టమైపోతుంది.

హెల్ప్ లైన్ వివరాలు :
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ సమస్యల పరిష్కారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. 1947 ఈ నెంబర్ కి ఫోన్ చేసి పరిష్కారం అడగవచ్చు. ఆధార్ హెల్ప్ లైన్ వారమంతా అందుబాటులో ఉంటుంది. ఏజెంట్ తో మాట్లాడేందుకు 1947 కాల్ చేయాలి. మీ సందేహాలను తీర్చుకోవడం కోసం సోమవారం నుండి శనివారం వరకు 7-9 గంటల వరకు ఫోన్ చేయవచ్చు. ఆదివారం 8-5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఆధార్ హెల్ప్ లైన్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతి, పంజాబీ, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ భాషలలో సేవలను అందిస్తుంది.

ఒక్కరోజులో లక్షన్నర కాల్స్ :
ఆధార్ కార్డు హోల్డర్ తమ రిజిస్టర్ మొబైల్ ద్వారా హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి మీ ఆధార్ నెంబర్ ను చెప్పి మీ సందేహాన్ని తీర్చుకోవచ్చు. దగ్గరలోని ఆధార్ సెంటర్ వివరాలు, ఎన్రోల్మెంట్ స్టేటస్, ఆధార్ కార్డు డెలివరీ స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఆధార్ ప్రతినిధి మీ సందేహాలకు సమాధానం ఇస్తారు.  కాల్ సెంటర్ ఒక రోజులో లక్షన్నర కాల్స్ స్వీకరించే సామర్థ్యం ఈ కాల్ సెంటర్ కు ఉంది. మీ మొబైల్, ల్యాండ్ లైన్ నుండి కూడా మీ సమీప ఆధార్ కేంద్ర వివరాలు పొందవచ్చు. మీ ప్రాంతంలోని ఆధార్ కేంద్రాల చిరునామాలు వంటి వివరాలను పొందవచ్చు. మీరు కేంద్రం యొక్క వివరాలను మై ఆధార్ ద్వారా కూడా పొందవచ్చు.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju