22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
న్యూస్

Aadhar: ఆధార్ లో పేరు మార్చుకోవడానికి 2 ఛాన్సులే..

Aadhar changes facility on UADAI
Share

Aadhar: మనం ఏ పని చేయాలన్నా, బ్యాంకులో ఎటువంటి లావాదేవీలు జరగాలన్నా.. కనీసం సిమ్ కార్డు తీసుకోవాలన్న ప్రతి చిన్న పనికి ఆధార్ కార్డు తప్పనిసరి.. అటువంటి ఆధార్ కార్డు లో ఏమైనా తప్పులుంటే.. వాటిని మార్చుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది..

Aadhar changes facility on UADAI
Aadhar changes facility on UADAI

ఆధార్ కార్డులో తప్పుల సవరణకు, అప్ డేట్ చేసుకునేందుకు అవకాశం తీసుకొచ్చింది. కాకపోతే కొన్ని వివరాలను పదే పదే మార్చుకోవడానికి వీలులేదని స్పష్టం చేసింది. పేరు, జెండర్, పుట్టిన తేదీ తదితర వివరాలను ఒకసారి మాత్రమే మార్చుకునే వీలుంటుందని స్పష్టం చేసింది. ఒక్కసారి మార్పులు చేసాకా మళ్ళీ మర్పులు చేయకూడదు.

ఆధార్ వివరాలలో ఏది ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే..
పేరు నమోదులో తప్పులు దొర్లితే రెండు సార్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత స్త్రీలు తమ ఇంటిపేరును మార్చుకునే అవకాశం ఉంది. ఆన్ లైన్ , మీ సేవా సెంటర్ లో ఆధార్ కార్డులోని పేరును మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డులో వివరాలు నమోదు చేసే సమయంలో జెండర్ విషయంలో పొరపాటు జరిగితే ఒకసారి మార్చుకునేందుకు యూఐడీఏఐ వీలు కల్పించింది.
పుట్టిన తేదీ విషయంలో కూడా ఒకేసారి మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.
ఆధార్ లో పేర్కొన్న నివాస స్థలం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లలో మార్పులు చేర్పులకు ఎలాంటి పరిమితి లేదు. ఈ వివరాలు తరచుగా మారే అవకాశం ఉంది. చిరునామా, ఫోన్ నెంబర్ మార్పులు చేసుకోవచ్చు.
వయసుతో పాటు శరీరంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. అందుకే ఈ వివరాలకు సంబంధించిన సవరణలకు యూఐడీఏఐ ఎలాంటి పరిమితి విధించలేదు. ఈ జాగ్రత్తలను చూసుకొని మీ ఆధార్ లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.


Share

Related posts

NTR : “ఏంటి నేను ఎన్‌టి‌ఆర్ పక్కన హీరోయిన్ నా?” నమ్మలేకపోతోంది ఈ పాప..! 

arun kanna

‘మహా’ సీఎం ఏక్ నాథ్ కీలక నిర్ణయం … వాహనదారులకు గుడ్ న్యూస్

somaraju sharma

Jamuna: టాలీవుడ్ సత్యభామ జమున ఇకలేరు..

bharani jella