ఏఏఐలో జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్, మేనేజ‌ర్‌ పోస్టుల భర్తీ.. వివరాలు ఇలా..

 

భార‌త ప్ర‌భుత్వ పౌర‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) 368 మేనేజ‌ర్‌, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది.. అర్హతలు, ఎంపిక విధానం వివరాలు ఇలా ఉన్నాయి..

ఇందులో మొత్తం 368 పోస్తులకుగాను
13 మేనేజ‌ర్, 355 జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల వయసు మేనేజ‌ర్‌-32 ఏళ్లు, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ 27 ఏళ్లు ఉండాలి. విభాగాల వారీగా ఖాళీలు టెక్నిక‌ల్‌, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌, ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్‌, ఫైర్ స‌ర్వీస్‌, , టెక్నిక‌ల్‌.ఈ పోస్టులకు సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌ ఉండాలి. మేనేజ‌ర్ పోస్టులకు అనుభ‌వం అవ‌స‌రం. జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎటువంటి అనుభ‌వం అవ‌సరం లేదు.ఈ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్‌, ఎండ్యూరెన్స్ టెస్ట్‌, డ్రైవింగ్ టెస్ట్‌,వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తులకు ప్రారంభతేదీ : 15.12.2020.
చివ‌రి తేది: 14.01.2021.