NewsOrbit
Featured న్యూస్

టీ అమ్ముకునే అతని కూతురు .. నేరుగా ఎయిర్ ఫోర్స్ కి – గుండెలు పిండేసే స్టోరీ !

ఇప్పుడు దేశమంతా ఇదే సంచలనం. “కష్టేఫలి” అన్న దానికి నిలువెత్తు రూపంగా నిలిచింది ఆ అమ్మాయి. మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాలో ఆంచల్ గంగ్వాల్ టీ కొట్టు నడుపుకునే సురేష్ గంగ్వాల్ కూతురు.  తన ఊరిలోని గవర్నమెంట్ కాలేజీ లో కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తనకు చిన్నప్పటి నుంచి డిఫెన్స్ లో చేరాలని కల. అంతే… చిన్నప్పటి నుంచి తన కల కోసం ఎంతో కష్టపడి చదివింది.

Meet Flying Officer Aanchal Gangwal Daughter Of A Tea Seller ...

సరే ఏముంది చివరికి ఎయిర్ ఫోర్స్ లో చేరి ఉంటుం… దీనికి ప్రత్యేకంగా చెప్పడం దేనికి? మంచి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని ఉంటుంది…. అందుకే క్లియర్ చేయగలిగింది అని మిగతా స్టోరీ మీరే ఊహించుకుంటే అది తప్పు. నేరుగా ఎయిర్ఫోర్స్ లోకి వెళ్లడం కష్టమని భావించిన ఆంచల్ మధ్యప్రదేశ్లో పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా చేరింది.

ఆ తర్వాత మధ్యప్రదేశ్ పోలీస్ శాఖ వారు ఆంచల్ ను లేబర్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా నియమించారు. అలా ఎనిమిది నెలలు పనిచేసిన తర్వాత ఎయిర్ ఫోర్స్ లో చేరాలంటే రాయాల్సిన AFCAT పరీక్ష రాసింది. ఆరవ అటెంప్ట్ లో ఆంచల్ పరీక్ష పాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. తన తల్లిదండ్రులు తను ఎయిర్ఫోర్స్లో చేరుతానంటే మొదట కొంచెం భయపడ్డారు. కానీ తనని ఆపలేదు. తర్వాత తన పట్టుదల చూసి వాళ్లే ఆంచల్ ని ప్రోత్సహించారు.

కట్ చేస్తే.. జూన్ 20, 2020 అంటే మొన్న శనివారం తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్ అయింది. హైదరాబాద్ లోని దిండిగల్ లో జరిగిన పరేడ్ లో పాల్గొని ప్రెసిడెంట్ చేతులమీదుగా షీల్డ్ తీసుకుంది. ఆ సమయంలో తమ కూతురు ప్రెసిడెంట్ చేతులమీదుగా షీల్ష్ అందుకోవడం చూడలేకపోయిన తల్లిదండ్రులు తమ కూతురిని టీవి లో చూసుకుని సంతోషించారు. 

ఆంచల్ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి కారణం ఏమై ఉంటుందో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. పెద్ద కలలు కనడానికి మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం అనేది ముఖ్యం కాదు మనం ఆ కలని సాధించడానికి ఎంతో కష్టపడుతున్నాం అనేదే ముఖ్యం అని ఆంచల్ మళ్లీ రుజువు చేసింది. ఆ సంవత్సరం ఎయిర్ ఫోర్స్ పరీక్షలు క్లియర్ చేసిన ఏకైక అభ్యర్థి ఆంచల్. అది తన కష్టానికి దక్కిన విలువ, గౌరవం.

author avatar
arun kanna

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N