NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PS AB Venkateswararao: ఏపీ సీఎస్ ను కలిసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. పోస్టింగ్ కోసం వినతి

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కి హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ క్యాట్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ ఏపీ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్ ను కొట్టివేసింది.

AB Venkateswararao

ఈ నేపథ్యంలో ఇవేళ (గురువారం) ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి ని కలిశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలను సీఎస్ కు అందజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలానే కోర్టు ఉత్తర్వుల ప్రతిని సీఈవో కార్యాలయంలో కూడా ఏబీవీ అందజేశారు. మే 31న ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనుండగా, ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గత ప్రభుత్వ హయాంలో రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసింది. ఆ తర్వాత ఆయన క్యాట్ ను ఆశ్రయించగా.. సస్పెన్షన్ ను సమర్ధించింది. అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్ ను కొట్టివేసింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉంచొద్దని ఆదేశిస్తూ .. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ను రద్దు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయనకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో  ఏ కారణంతో సస్పెండ్ చేశారో .. తిరిగి అదే కారణంతో మరో సారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండు సార్లు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం క్యాట్ .. ఆయన సస్పెన్షన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని.. సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు .. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది. ప్రభుత్వ అప్పీల్ ను కొట్టేసింది.

 

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N