NewsOrbit
Featured న్యూస్

మహిళల రక్షణకు ఏపీ ప్రభుత్వం “అభయం” ఇదే..! ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా?

 

 

దిశా చట్టాన్నిమొట్టమొదటి గా ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇంకొక ఆడగు ముందుకు వేస్తూ మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అభయం ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అన్ని జగన్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయం యాప్ ను వర్చ్యువల్ విధానంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. రవాణా శాఖ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతూ ఉందని, మహిళలు, చిన్నారుల రక్షణ కోసమే ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.ఆటోలు, క్యాబ్ లలో ఆడవారు నిర్భయం గా ప్రయాణం చేయడానికి ఈ డివైసెస్ ను ఆటో లు క్యాబ్ లలో ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ఆర్ధిక, రాజకీయ స్వావలంబన కలిగించడానికి, మహిళలకు రక్షణ కల్పించడానికి రాజి లేకుండా పనిచేస్తూన్నామని పేర్కొన్నారు.

 

jagan mohan reddy launched abhyam app in ap

 

ఆటోలు, క్యాబ్ లలో కొత్త డివైసెస్:
మహిళలు రక్షణ లో భాగంగా ఆటోలు, క్యాబ్ లలో అభయం యాప్ కు సంభందించిన కొత్త పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని వల్ల మహిళలు ప్రయాణించేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అన్ని జగన్ అన్నారు. మహిళలు ప్రయాణించేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఆటో లో ఉన్న డివైస్ లో ఉన్న ప్యానిక్ బటన్ నొక్కడం తో అభయం యాప్ ద్వారా రవాణా శాఖ పోలీస్ లకి సమాచారం అందుతుంది. ఈ సమాచారం తో పోలీసులు ఆటోను ట్రేస్ చేసి 10 నిమిషాలలో చేరుకుంటారు. ఈ డివైస్ల ను మొట్టమొదటిసారిగా 1000 వాహనాలలో ఏర్పాటు చేస్తున్నట్లు, వచ్చే సంవత్సరం నవంబర్ నాటికీ లక్ష వాహనాలలో ఏర్పాటు చేస్తామని పేరుకొన్నారు.

 

abhyam app starts in ap

డివైస్ లేని ఆటో లో మొబైల్ తోనే:
డివైసెస్ అమర్చని ఆటో లలో మొబైల్ లో అభయం యాప్ ద్వారా కూడా రక్షణ పొందవచ్చు. మహిళలు తమ మొబైల్ ఫోన్స్ లో అభయం అప్ ను ఇన్ స్టాల్ చేసి లాగిన్ అవవచ్చు. ఆటో, క్యాబ్ ఎక్కేటప్పుడు అభయం యాప్ లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో నెంబర్, ఆటో డ్రైవర్ వివరాలు యాప్ లో నమోదు అవుతాయి. ఏదీ అయ్యిన ఇబ్బంది అనిపించినపుడు ఈ అప్ ద్వారా సమాచారం అందించ్చవచ్చు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే ఈ మొత్తం ప్రాజెక్ట్ విలువ 138.48 కోట్లు. దశలవారీగా రాష్ట్రం లో లక్ష వాహనాలకు ట్రాకింగ్ డివైస్ ల ను అమర్చి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju