తన కూల్ అండ్ కామ్ క్యారెక్టర్‌తో అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిపోయాడు. అసాధారణ రీతిలో జనాలు అతనికి ఓట్లు వేసి గెలిపించారు. అమ్మాయిల్లో అతని ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒక పక్క ఇంట్లో మోనాల్, హారిక లతో సన్నిహితంగా ఉంటూ తన గేమ్ డిజైన్ చేసుకునే విధానం అందరిని మెప్పించింది.
అయితే హారిక తో అభి బాగా క్లోజ్ అయిపోయాడు అని చెప్పాలి. ఆమె కూడా విపరీతమైన ప్రేమ తో ముద్దులు కురిపించేది… కౌగిలింతలు ఇచ్చేది. వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని అందరు అనుకున్నారు. కనీసం క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అవుతారని అన్నారు. అయితే బయటకు వచ్చి ఒక్కసారిగా అభి హారిక ను తన చెల్లి అనేసాడు. ఈ విషయం ఆమెతో కూడా చెప్పినట్లు చెప్పడం గమనార్హం.
24 గంటల్లో మీకు చూపించేది గంట కాబట్టి బహుశా నా మాటలను టెలికాస్ట్ చేయలేదేమో అని అన్నాడు. ఇక అభిజిత్ ఫ్యాన్స్ తో పాటు అతని సొంత అభిమానులు కూడా ఈ విషయంపై కొద్దిగా కోపంగా ఉన్నారు ఇంటిలో ఆమెతో సన్నిహితంగా ఉండి బయటకు వచ్చి చెల్లి అనడం ఏమిటో వారికి అర్థం కావడం లేదట. ఇక బయటికి వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ పై హారిక క్లారిటీ ఇవ్వదు. పైగా పూర్తి సీజన్ టెలికాస్ట్ చేయరు అనే ధైర్యంతోనే అభిజిత్ ఇలా అంటున్నాడని అతని యాంటీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరి అభి నిజంగానే ఇంటిలో హారిక ను చెల్లి అనుకున్నాడా…?