బిగ్బాస్ ఇంటిలో ఏర్పడిన బంధాలు బయట కూడా కొనసాగుతాయని కచ్చితంగా చెప్పలేము. దాదాపు వంద రోజులకు పైగా షో లో కలిసి ఉన్న వారు బయట అపరిచిత వ్యక్తులు గా వ్యవహరించడం సర్వసాధారణమే. ఎందుకంటే 24 గంటల్లో మనకు చూపించేది కేవలం గంట మాత్రమే.
ఇక ఎడిటింగ్ లతో కొన్ని బంధాలు దగ్గర అయినట్లు మనకు దూరమైనట్లు అనిపిస్తాయి. బిగ్బాస్ మొదటిరోజే హారిక-అభిజిత్ లను కనెక్షన్ గేమ్ తో కలిపేశాడు. ఆ మధ్య విభేదాలు వచ్చినా కూడా వారిద్దరూ చాలా కలిసిపోయారు. వీరిద్దరి ఫ్రెండ్షిప్ చూసి ప్రేక్షకులు చాలా ముచ్చటపడ్డారు. హారిక తల్లి అయితే ఏకంగా పెళ్లి వరకు వెళ్ళింది.
వాళ్ళిద్దరికీ సరే అయితే అభిజిత్ వాళ్ళ ఇంట్లో ఓకే అంటే నాకేమీ ఇబ్బంది లేదు అంటూ చెప్పేసింది. అయితే ఇలా అందరూ ఒకలాగా వారి బంధాన్ని చూస్తుంటే అభిజిత్ బాంబు పేల్చాడు. తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు నీలాంటి ఒక చెల్లి ఉంటే బాగుండు అని హారిక కు ఎన్నోసార్లు ఉన్నాను అని చెప్పాడు. ఆమె సిస్టర్ లాంటిది అని చాలా సార్లు చెప్పాను… బహుశా అది టేలికాస్ట్ చేయలేదేమో అని అన్నాడు. ఇంట్లో రిలేషన్షిప్ కోసమే అభిజిత్ బయటికి ఇలా చూపించాడా అన్న అనుమానాలు వస్తున్నాయి.