బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ అభిజిత్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. తెలుగులో టాప్ మోస్ట్ చానల్స్ అభి ని పిలుస్తూ బిగ్ బాస్ హౌస్ లో అనుభవాలు చెప్పాలని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ కెరియర్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు వంటి విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలో రన్నరప్ గా నిలిచిన అకిల్ తో జరిగిన గొడవ గురించి ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ అభి ని ప్రశ్నించడం జరిగింది. దీంతో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. హౌస్ లో ఎవరితో కూడా నాకు ప్రత్యేకంగా గొడవలు లేవని చెప్పుకొచ్చాడు అభి. అంతమాత్రమే కాకుండా కేవలం టాస్క్ సమయంలో అదే విధంగా ఎలిమినేషన్ కి నామినేషన్ ఈ ప్రక్రియలో చిన్న చిన్న గొడవలు జరుగుతాయని, అయినా హౌస్ లో ఇద్దరి మధ్య చిన్న చిన్న వివాదాలు జరిగినా అవి పెద్దగా ఇద్దరి బాండింగ్ విడదిసినంత సిచువేషన్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.
అంతమాత్రమే కాకుండా రన్నరప్ అఖిల్ భవిష్యత్తులో మంచి అవకాశాలు అందుకుని ఉన్నత స్థాయిలో తన కెరియర్ ఉండాలని అభిజిత్ కోరుకున్నాడు. హౌస్ లో నాకు పెద్దగా ఎవరితో శత్రుత్వం లేదని కేవలం గేమ్ పరంగా మాత్రమే పోటీపడటం జరిగిందని అభి తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.